ScienceAndTech

రష్యా మూన్ మిషన్ విఫలం

రష్యా మూన్ మిషన్ విఫలం

ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌ 3 కి పోటీగా.. చంద్రుడిపై ప్రయోగాలు జరిపేందుకు నింగిలోకి రష్యా పంపించిన అంతరిక్ష నౌక కూలిపోయింది. చంద్రుడిపైకి విజయవంతంగానే వెళ్లిన లూనా 25 స్పేస్‌క్రాఫ్ట్‌‌లో.. జాబిల్లిపై దిగే ఒక్కరోజు ముందు సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ లూనా 25 అంతరిక్ష నౌక చంద్రుడిపై పడిపోయిందని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్‌కాస్మోస్ తెలిపింది.

రష్యా లూనా 25 మూన్ మిషన్ విఫలమైంది. చంద్రుడిపై దిగే క్రమంలో క్రాష్ అయినట్టు బలంగా ఢీకొట్టడం వల్ల మిషన్ ఫెయిల్ అయింది. ఆగస్టు 11న రష్యా లూనా 25 ను (Russia Luna-25 Moon Mission) లాంఛ్‌ చేసింది రష్యా. ఆగస్టు 21న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవ్వాల్సి ఉన్నా…ఢీకొట్టడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. రష్యా స్పేస్ కార్పొరేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం… రోబో ల్యాండర్ అనుకోకుండా ఓ ఆర్బిట్‌లోకి ఎంటర్ అయ్యింది. ఆ తరువాత చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టిందనిరోస్‌కాస్మోస్(Roskosmos) వెల్లడించింది . లూనార్ మిషన్స్‌ చాలా రిస్క్‌తో కూడుకుని ఉంటాయని, సక్సెస్ రేట్ 70% మాత్రమే ఉంటుందని వెల్లడించారు. ఆ అనుమానానికి తగ్గట్టుగానే ఈ మిషన్ ఫెయిల్ అయింది. భారత్ చంద్రయాన్ 3తో పాటు రష్యా లూనా 25 మిషన్ కొనసాగింది. అయితే…ఆగస్టు 19న లూనా 25 స్పేస్‌క్రాఫ్ట్‌లో టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. అప్పటి నుంచి దీనిపై అంచనాలు తలకిందులయ్యాయి. రష్యా స్పేస్ ఏజెన్సీ ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించింది. అటు చంద్రయాన్ 3 చంద్రుడికి దగ్గర్లో ఉండటం ఉత్కంఠ రేపుతోంది. లూనా 25 మిషన్ ఫెయిల్ అయిన నేపథ్యంలో చంద్రయాన్ 3పై అంచనాలు భారీగా పెరిగాయి.

దాదాపు 50 ఏళ్ల తర్వాత రష్యా మొదటిసారి జాబిల్లిపై పరిశోధనలు చేసేందుకు ఈ లూనా 25 అంతరిక్షనౌకను ప్రయోగించింది. అయితే ఈ లూనా 25 స్పేస్‌క్రాఫ్ట్ చంద్రయాన్ 3 కన్నా ఆలస్యంగా వెళ్లినా దానికంటే రెండు రోజుల ముందు అంటే ఆగస్టు 21 వ తేదీన జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగాల్సి ఉంది. అయితే ల్యాండింగ్‌కు ముందు నిర్వహించిన కొన్ని ప్రక్రియల సమయంలో లూనా 25 చంద్రునిపై కూలిపోయిందని రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్ ఆదివారం ( ఆగస్టు 20) వెల్లడించింది. అంతకుముందు శనివారం( ఆగస్టు 19 ) మధ్యాహ్నం 2.57 గంటలకు లూనా 25 తో.. తమకు సంబంధాలు తెగిపోయాయని రోస్‌కాస్మోస్ తెలిపింది. దీంతో వెంటనే చర్యలు చేపట్టామని.. ప్రాథమిక పరిశోధనల ప్రకారం ల్యాండర్ చంద్రుని ఉపరితలంతో ఢీకొన్న తర్వాత ఎలాంటి సమాచారం అందలేదని పేర్కొంది. ఈ క్రమంలోనే లూనా 25 స్పేస్‌క్రాఫ్ట్ కూలిపోయినట్లు ప్రకటించింది