Agriculture

సెప్టెంబర్ 30 వరకు పంటలు వేసుకోవచ్చని వ్యవసాయ శాఖ ప్రకటన

సెప్టెంబర్ 30 వరకు పంటలు వేసుకోవచ్చని వ్యవసాయ శాఖ ప్రకటన

ఖరీఫ్‌లో సెప్టెంబరు 30 వరకు పంటలు వేసుకునే అవకాశం ఉందని వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్‌ సి.హరికిరణ్‌ తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న జిల్లాల్లో సెప్టెంబరు మొదటి వారం వరకు చూసి.. తర్వాతే ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లే ఆలోచనల్లో రైతులు ఉన్నారని సంబంధిత జిల్లాల సంయుక్త కలెక్టర్లు చెప్పినట్లు వివరించారు. ‘తగ్గిన ఖరీఫ్‌ పంటల విస్తీర్ణం’ శీర్షికన మంగళవారం ‘ఈనాడు’ పత్రికలో వచ్చిన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. సెప్టెంబరు 30 వరకు వరినాట్లు కొనసాగుతాయని, సాగు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2.70లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు కావాల్సిన 60వేల క్వింటాళ్ల విత్తనాలను రైతులకు 80% రాయితీపై అందించేందుకు సిద్ధంగా ఉంచామని వివరించారు.