DailyDose

MoE: ఇక పై బోర్డు పరీక్షలు సంవత్సరానికి రెండుసార్లు!

MoE: ఇక పై బోర్డు పరీక్షలు సంవత్సరానికి రెండుసార్లు!

నూతన జాతీయ విద్యావిధానానికి అనుగుణంగా  విద్యా వ్యవస్థలో కేంద్రం పలు కీలక మార్పులు చేసింది. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించేలా నేషనల్‌ కరికులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ను ప్రకటించింది.  ఇలా ఏడాదిలో రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గడంతో పాటు వారి స్కోరును మెరుగుపరుచుకొనేందుకు అవకాశం లభిస్తుందని తెలిపింది. అలాగే, 11, 12 తరగతుల విద్యార్థులు రెండు లాంగ్వేజ్‌లను కచ్చితంగా అభ్యసించాలని.. వీటిలో ఒకటి భారతీయ భాష అయి ఉండాలని స్పష్టం చేసింది.నూతన విద్యా విధానానికి (NEP)కి అనుగుణంగానే 2024 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేస్తామని విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  ఏడాదికి రెండు సార్లు బోర్డు పరీక్షలు నిర్వహించడం ద్వారా విద్యార్థులు ప్రిపేర్‌ అయ్యేందుకు తగినంత సమయం దొరకడంతో పాటు మంచి పనితీరు కనబరిచేందుకు వీలుంటుందని విద్యాశాఖ తెలిపింది.