Business

వాట్సాప్‌లో కొత్త తరహా మోసం-TNI నేటి వాణిజ్య వార్తలు

వాట్సాప్‌లో కొత్త తరహా మోసం-TNI నేటి వాణిజ్య వార్తలు

ఐటీ వెబ్​సైట్​ కొత్త మాడ్యూల్స్ తో రీలాంచ్‌ 

ఇన్‌కమ్‌ ట్యాక్స్​ డిపార్ట్​మెంట్​తమ వెబ్​సైట్​ను మరింత యూజర్​ ఫ్రెండ్లీగా మార్చడంతో పాటు, వాల్యూయాడెడ్​ ఫీచర్లు, కొత్త మాడ్యూల్స్ తో రీలాంచ్‌ ​ చేసింది . ఈ కొత్త వెబ్​సైట్​ను సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​డైరెక్ట్​ టాక్సెస్​ (సీబీడీటీ) చైర్మన్​ నితిన్​ గుప్తా  ఉదయ్​పూర్​లో జరిగిన చింతన్​ శిబిర్​లో ప్రారంభించారు. పన్ను చెల్లింపుదారులకు మంచి ఎక్స్​పీరియన్స్​ ఇవ్వడంతో పాటు, కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలనే ఆలోచనతోనే వెబ్​సైట్​రీలాంచ్‌​ చేసినట్లు ఇన్‌కమ్ ట్యాక్స్​ డిపార్ట్​మెంట్​ వెల్లడించింది. మొబైల్​ నుంచి  చూసేందుకు కూడా కొత్త వెబ్​సైట్​ అనువుగా ఉంటుందని పేర్కొంది. కంటెంట్​ కోసం  మెగా మెను ఉంటుందని, కొత్త ఫీచర్లు, ఫంక్షనాలిటీస్​ చేర్చామని వివరించింది. వెబ్​సైట్​ విజిటర్లకు ఈ కొత్త మార్పులన్నీ వివరించేందుకు ఒక వర్చువల్​ గైడెడ్​ టూర్ ​అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది. పన్ను చెల్లింపుదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అవసరమైన కంటెంట్​ను వెతుక్కునేందుకు వీలుగా ఉంచినట్లు వెల్లడించింది

* టెకీల‌కు గుడ్‌న్యూస్‌

ఇంట‌రాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ (ChatGPT) రాక‌తో లేటెస్ట్ టెక్నాల‌జీ టెకీల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏఐ టూల్స్‌తో కొలువుల కోత త‌ప్ప‌ద‌ని, న్యూ టెక్నాల‌జీతో వేలాది ఉద్యోగాలు క‌నుమ‌రుగ‌వుతాయ‌నే ఆందోళ‌న సర్వ‌త్రా నెల‌కొంది. రాబోయే రోజుల్లో ఏఐ టూల్స్ విధ్వంసానికి భారీ మూల్యం చెల్లించ‌క‌త‌ప్ప‌ద‌ని ప‌లువురు టెక్ దిగ్గ‌జ కంపెనీ సీఈవోలు సైతం హెచ్చ‌రించారు. అయితే ఏఐతో ఉద్యోగాల‌కు ఎలాంటి ఢోకా ఉండ‌ద‌ని, లేటెస్ట్ టెక్నాల‌జీ జాబ్స్‌లో మాన‌వుల‌ను రీప్లేస్ చేయ‌లేద‌ని తాజా అధ్య‌య‌నం వెల్ల‌డించింది.ఐక్య‌రాజ్య‌స‌మితి అంత‌ర్జాతీయ కార్మిక సంస్ధ (ఐఎల్ఓ) ఇటీవ‌ల వెల్ల‌డించిన అధ్యయ‌నం ఏఐపై ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని తెల‌ప‌డం టెకీల‌కు రిలీఫ్ ఇచ్చింది. మ‌నం చేసే ప‌నుల‌ను ఏఐ మార్చేస్తుంది త‌ప్ప ఉద్యోగాల నుంచి మ‌నుషుల‌ను తీసివేయ‌ద‌ని ఐఎల్ఓ రిపోర్ట్ తేల్చిచెప్పింది. ఏఐ రాక‌తో ఎన్నో ఉద్యోగాలు, ప‌రిశ్ర‌ము కేవ‌లం పాక్షికంగానే యాంత్రీక‌ర‌ణ‌కు గుర‌వుతాయ‌ని పేర్కొంది.చాట్‌జీపీటీ వంటి జ‌న‌రేటివ్ ఏఐ తాజా వేవ్ ఫ‌లితంగా ఇది కంపెనీల‌కు వ‌రంగానే మారుతందని, ఉద్యోగుల‌ను రీప్లేస్ చేయ‌డం వంటి ప్ర‌తికూల ప్ర‌భావం ఉండ‌ద‌ని ఐఎల్ఓ అధ్య‌య‌న నివేదిక తేల్చిచెప్పింది. లేటెస్ట్ టెక్నాల‌జీతో ఉపాధి విధ్వంసం ఉండ‌ద‌ని, నాణ్య‌త‌తో కూడిన ఉద్యోగాలు, ప‌నుల్లో వేగం వంటి మార్పులు చోటుచేసుకుంటాయ‌ని పేర్కొంది. నూత‌న టెక్నాల‌జీ ప్ర‌భావం ఆయా వృత్తులు, ప్రాంతాల‌కు అనుగుణంగా వేర్వేరుగా ఉంటాయ‌ని వెల్ల‌డించింది. లేటెస్ట్ టెక్నాల‌జీ పురుషుల‌తో పోలిస్తే మ‌హిళ‌ల ఉద్యోగాల‌పై ప్ర‌భావం చూపే అవ‌కాశం అధిక‌మ‌ని నివేదిక అంచ‌నా వేసింది.

*  అద్భుతమైన ఫీచర్లతో బోట్‌ ‘స్మార్ట్ రింగ్’ లాంచ్‌

ఇప్పటివరకూ స్మార్ట్‌ వాచీలను ఎక్కువగా చూస్తున్నాం.. ఇప్పుడిప్పుడే చేతి వేళ్లకు ధరించగలిగే ‘స్మార్ట్ రింగ్’లు సైతం మార్కెట్‌లోకి వస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్లతో  ఇలాంటి స్మార్ట్‌ రింగ్‌ను ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ బోట్ తాజాగా లాంచ్‌ చేసింది. ఆరోగ్య పర్యవేక్షణ నుంచి సింగిల్ హ్యాండ్ కదలికల ద్వారా చేసే స్మార్ట్ ట్రాకింగ్ యాక్టివిటీ వరకూ పలు రకాల ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్‌ ధరను రూ. 8,999లుగా కంపెనీ ప్రకటించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బోట్ వెబ్‌సైట్‌లలో ఆగస్టు 28 మధ్యాహ్నం 12 గంటల తర్వత నుంచి ఈ స్మార్ట్‌ రింగ్‌ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. అందరి వేళ్లకూ సరిపోయేలా ఈ రింగ్ మూడు సైజ్‌లలో వస్తుంది.బోట్‌ స్మార్ట్‌ రింగ్‌ ఫీచర్ల,స్టైలిష్‌, ప్రీమియం, మెటాలిక్‌ లుక్‌,స్వైప్ నావిగేషన్‌తో ఇతర డివైజ్‌ల కంట్రోల్‌,ప్లే/పాజ్ మ్యూజిక్‌, ట్రాక్‌ చేంజ్‌, పిక్చర్‌ క్లిక్, అప్లికేషన్‌ల నావిగేట్,హార్ట్‌ రేటు, బాడీ రికవరీ, శరీర ఉష్ణోగ్రత, స్లీప్‌ మానిటరింగ్‌, ఋతుక్రమ ట్రాకర్‌, సొంత బోట్‌ రింగ్ యాప్‌కు కనెక్ట్,స్టెప్‌ కౌంట్‌, కరిగిన కేలరీలు, ప్రయాణించిన దూరం వంటి స్మార్ట్ యాక్టివిటీ ట్రాకింగ్,అత్యవసర పరిస్థితుల్లో ఇతరులను అప్రమత్తం చేసే ఎస్‌వోఎస్‌ ఫీచర్,5 ఏటీఎం వరకు వాటర్ రెసిస్టెన్స్.

*    వారి రిటైర్‌మెంట్‌ వయస్సు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం

ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల విషయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల పదవీకాలన్నీ మరో రెండు సంవత్సరాలు పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పీఎస్‌బీల మేనేజింగ్‌ డైరెక్టర్ల పదవీ కాలం 60 సంవత్సరాలుగా ఉంది. అయితే వీరి రిటైర్మెంట్ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందట. దేశంలో ద్రవ్యోల్భణం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి గురించి, అభివృద్ధి గురించి తెలిసిన వీరి సేవలను మరికొంత కాలం వినియోగించుకుంటే బాగుంటుందని ప్రభుత్వం అనుకుంటుందట. దీంతోనే వారి పదవీవిరమణ వయసును పెంచాలనే నిర్ణయానికి వచ్చిందని సమాచారం.ఈ నిర్ణయంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేశ్ ఖారా పదవీకాలం కూడా మరో రెండేళ్లు పొడిగించే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ 2020 నుంచి ఎస్బీఐ చైర్మన్‌గా ఖారా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ అక్టోబర్ తో ఆయన పదవీ కాలం ముగియనుంది. ఈ అక్టోబర్ తో ఆయనకు 63 ఏళ్లు వస్తాయి. అయితే ఆయన పదవీవిరమణ వయసును 65 ఏళ్లకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆయన మరో రెండేళ్లు సేవలను అందిస్తారు. ప్రభుత్వ దిగ్గజ ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చైర్మన్ వయసును కూడా 65 ఏళ్లకు పెంచే అవకాశాలు ఉన్నాయి. అయితే దేశంలో ఉన్న ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులలో మేనేజింగ్ డైరెక్టర్లు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల పదవీకాలం ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉంది. ప్రభుత్వం కనుక రిటైర్మెంట్ విషయంలో నిర్ణయం తీసుకుంటే అది 62 సంవత్సరాలు కానుంది. ఇక గతేడాదే డైరెక్టర్ల గరిష్ట కాల పరిమితిని 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికైతే రిటైర్మెంట్ వయోపరిమితిని పెంచే నిర్ణయాన్ని ఇంకా తీసుకోలేదని, భవిష్యత్తులో తీసుకునే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు సూచన ప్రాయంగా వెల్లడించారు. చూడాలి మరి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో. ఇక వచ్చే రెండు నెలల్లో అంటే అక్టోబర్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేశ్ ఖారా పదవీకాలం ముగుస్తుంది. కాబట్టి ఈ రెండు నెలల లోపే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆయన రిటైర్మెంట్ వయసు పెరిగే అవకాశం ఉంది.

10 కోట్ల మంది విమాన ప్రయాణికులకు సేవలందించడమే  లక్ష్యం

 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10 కోట్ల మంది విమాన ప్రయాణికులకు సేవలందించడమే లక్ష్యమని ఇండిగో సీఈఓ పీటర్‌ ఎల్బెర్స్‌ తెలిపారు. కంపెనీ 20 వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో వాటాదార్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నిలిచిపోయిన విమానాలు ఎగిరేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని, కంపెనీ నికర విలువను మళ్లీ సానుకూలంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఎన్ని విమానాలు నిలిచిపోయాయన్న వివరాలను తెలపలేదు. కొవిడ్‌కు ముందు కంపెనీ బ్యాలెన్స్‌ షీట్‌ బలంగా ఉందని, కొవిడ్‌ ప్రభావంతో కంపెనీ నికర విలువ ప్రతికూలంగా మారిందని ఇండిగో సీఎఫ్‌ఓ గౌరవ్‌ నేగి పేర్కొన్నారు. గత మూడు త్రైమాసికాల్లో లాభాలు నమోదు చేయడంతో బ్యాలెన్స్‌ షీట్‌ బలోపేతమైందని అన్నారు. ప్రస్తుతం ఇండిగోకు దేశీయ విపణిలో 63 శాతానికి పైగా వాటా ఉండగా, అంతర్జాతీయ కార్యకలాపాలపై కంపెనీ దృష్టిపెడుతోంది. జూన్‌ చివరకు ఇండిగో చేతిలో 316 విమానాలు ఉన్నాయి. ఇందులో 166 ఏ320 నియోలు, 87 ఏ321 నియోలు, వెట్‌ లీజ్‌పై రెండు విమానాలు ఉన్నాయి. జూన్‌ త్రైమాసికంలో కంపెనీ రూ.3090.6 కోట్ల లాభాన్ని, రికార్డు స్థాయిలో రూ.17,160.9 కోట్ల ఆదాయాన్ని నమోదుచేసింది.

 రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్తగా ‘2023 బుల్లెట్ 350’ బైక్

 ప్రముఖ టూవీలర్ దిగ్గజ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్తగా ‘2023 బుల్లెట్ 350’ బైక్ ఇండియా మార్కెట్లోకి రాబోతుంది. సెప్టెంబర్ 1న ఇది లాంచ్ కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ కొత్త అప్‌డేటెడ్ 2023 బుల్లెట్ 350 లో ‘J సిరీస్’ ఇంజన్ అమర్చారు. ఇది మూడు వేరియంట్లలో.. బేస్, మిడ్, టాప్ మోడల్‌లో లభిస్తుంది. ఈ బైక్ 349cc J-సిరీస్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను కలిగి ఉంది. 20hp పవర్, 27Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిలో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌‌ను అందించారు. బ్రేకింగ్ సిస్టమ్ విషయానికి వస్తే, డ్యూయల్ ఛానల్ ABS సిస్టంను కలిగి ఉంటుంది. ఇంకా LCD డేటా డిస్‌ప్లేతో కూడిన సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, USB చార్జింగ్ పోర్ట్, ముందు19-అంగుళాల స్పోక్డ్ వీల్, బ్యాక్ 18-అంగుళాల స్పోక్డ్ వీల్ ఉన్నాయి.

వాట్సాప్‌లో కొత్త తరహా మోసం

ఆధునిక కాలంలో టెక్నాలజీ వేగంగా పెరుగుతున్న తరుణంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొంతకాలంగా నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళను డబ్బులు అడగటం వంటివి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కొంతమంది వాట్సాప్ వేదికగా మోసాలు చేయడానికి పూనుకున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.నివేదికల ప్రకారం.. ‘మీరు మెసేజ్ చూసాక ఫోన్ చేయండి.. ధన్యవాదాలు’ అంటూ అధికారులు పంపించినట్లు మెసేజులు చాలామందికి వచ్చినట్లు తెలుస్తోంది. వాట్సాప్‌కి మాత్రమే కాకుండా ఇలాంటి మెసేజులు ఇతర ఏ యాప్స్‌‌కి వచ్చినా యూజర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.ఈ మెసేజులు చూసి ఎవరైనా ఫోన్ చేసినట్లయితే వ్యక్తిగత సమాచారం లేదా డబ్బు పోయే అవకాశం ఉంటుంది. కావున వినియోగదారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో విదేశాల నెంబర్ కోడ్స్‌తో ఫేక్ కాల్స్ వచ్చేవి. ఇలాంటి వాటి వల్ల కూడా చాలామంది డబ్బు కోల్పోయే అవకాశం ఉంది.నిజానికి మీకు తెలియని నెంబర్ నుంచి మెసేజ్ గానీ, ఫోన్ గానీ వచ్చినట్లయితే.. వాటి పట్ల కొంత అప్రమత్తంగా ఉండాలి. తెలియని నంబర్స్‌‌‌‌ని బ్లాక్ చేసుకోవడం మంచిది. అంతే కాకుండా వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. పబ్లిక్ ప్లేస్‌లో ఫ్రీ వై-ఫై ఉపయోగించుకోకుండా ఉండటం ఉత్తమం.

పారాబాయిల్డ్ ​ రైస్​ ఎక్స్​పోర్ట్స్​పై 20 శాతం డ్యూటీ

దేశీయంగా తగినన్ని నిల్వలు ఉండేలా చూసే ఉద్దేశంతో పారాబాయిల్డ్​ రైస్​ ఎగుమతులపై 20 శాతం డ్యూటీని ప్రభుత్వం విధించింది. దేశంలో ధరలు పెరగకుండా చూడాలనేది కూడా ఒక లక్ష్యం. ఆగస్టు 25 నుంచి అమలవుతున్న ఈ డ్యూటీ విధింపు అక్టోబర్​ 16 దాకా అమలులో ఉంటుందని ఫైనాన్స్​ మినిస్ట్రీ వెల్లడించింది. ఆగస్టు 25 కి ముందుగా  కస్టమ్స్​ పోర్టులలో ఉంచిన పారాబాయిల్డ్​ రైస్​ కి మాత్రం డ్యూటీ ఎగ్జంప్షన్​  ఉంటుందని పేర్కొంది. ఈ చర్యతో అన్ని రకాల నాన్​–బాస్మతి రైస్​పైనా ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లయింది. దేశం నుంచి ఎగుమతయ్యే రైస్​లో నాన్​–బాస్మతి వైట్​రైస్​కి 25 శాతం వాటా ఉంటోంది. నాన్​– బాస్మతి రైస్​ ఎగుమతులను కిందటి నెల నుంచి ప్రభుత్వం నిషేధించింది. రాబోయే పండగ సీజన్​లో దేశంలో బియ్యం రేట్లు పెరగకుండా చూడాలనే టార్గెట్​తోనే ఈ నిషేధం విధించారు. ఈ ఏడాది ఏప్రిల్​–జూన్​ మధ్య కాలంలో ఇండియా నుంచి 15.54 లక్షల టన్నుల నాన్​–బాస్మతి వైట్  ​రైస్​ ఎగుమతులు జరిగాయి.

* నేటి బంగారం ధరలు

గత రెండు రోజుల నుంచి పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. మన ఇళ్లలో ఏ చిన్న శుభకార్యం జరిగిన మహిళలు బంగారం కొంటుంటారు. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో చూసుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,500 గా ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,450 గా ఉంది.నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే:22 క్యారెట్ల బంగారం ధర – రూ 54,500,24 క్యారెట్ల బంగారం ధర – రూ 59,450.నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే:22 క్యారెట్ల బంగారం ధర – రూ 54,500,24 క్యారెట్ల బంగారం ధర – రూ 59,450