DailyDose

ఏలూరు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం- TNI నేటి నేర వార్తలు

ఏలూరు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం- TNI నేటి నేర వార్తలు

* ఏలూరు ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

ఏలూరు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య యత్నం చేసుకుంది. సీనియర్ విద్యార్థినిలు వేధింపులు తట్టుకోలేక ఫస్ట్ ఇయర్ చదువుతున్న నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య యత్నం చేసుకుంది.ప్రస్తుతం ఆస్పత్రిలో బాధిత విద్యార్థిని చికిత్స పొందుతోంది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నది కళాశాల సిబ్బంది. అయితే.. ఆత్మహత్య యత్నం చేసిన విద్యార్థిని నర్సింగ్ స్టూడెంట్ ప్రమీల అని సమాచారం అందుతోంది. ఈ విషయాన్ని అసలు బయటపెట్టడం లేదు కళాశాల సిబ్బంది. ఇక ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

డ్రగ్స్‌ కేసులో సైబర్‌ క్రైమ్‌ ఎస్సై అరెస్ట్

డ్రగ్స్‌ కేసులో నగరంలో మరో సంచలన సంఘటన చోటు చేసుకుంది. సైబర్‌క్రైమ్‌ ఎస్సై రాజేందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌ పట్టివేతలో రాజేందర్‌ చేతివాటం ప్రదర్శించడమే అందుకు కారణం. పట్టుబడిన డ్రగ్స్‌లో కొంతమేర దాచి అమ్ముకునేందుకు ప్రయత్నించాడు. ఉన్నతాధికారుల విచారణలో ఎస్సై అవినీతి బయటపడటంలో రాయదుర్గం పీఎస్‌లో రాజేందర్‌పై కేసు నమోదైంది. ఈ మేరకు ఎస్సై రాజేందర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు రాజేందర్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగంలో ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలో చేసిన ఓ స్వింగ్‌ ఆపరేషన్‌లో ఎస్సై రాజేందర్‌ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో భారీగా డ్రగ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పట్టుబడిన డ్రగ్స్‌ను కోర్టులో ప్రవేశపెట్టలేదు. ఈ వ్యవహరం తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగగా అసలు విషయం బయటపడింది. ఎస్‌ఐ రాజేందర్‌ ఇంట్లో పోలీసులు తనిఖీలు చేపట్టగా భారీగా డ్రగ్స్‌ లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు రాయదుర్గం పోలీసులు రాజేందర్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ తరలించారు. దాచిన డ్రగ్స్‌ను అమ్ముకోవడానికి రాజేందర్‌ పథకం పన్నినట్లు పోలీసుల విచారణలో బయపడింది. ఎస్సై రాజేందర్‌పై గతంలో కూడా పలు కేసులు ఉన్నాయి. ఓ కేసు విషయంలో రాజేందర్‌ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. దీంతో అధికారులు రాజేందర్‌ను సర్వీస్‌ నుంచి తొలగించగా కోర్టును ఆశ్రయించి ఉత్తర్వులపై స్టే తెచ్చుకున్నాడు.

*  జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం 

జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తున్న మనుషుల గుంపు పైకి కారు దూసుకుపోయింది.. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.. ఈ సంఘటన రాష్ట్ర రాజధాని రాంచీకి 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న చైన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బరాన్ గ్రామంలో సోమవారం అర్ధరాత్రి జరిగిందని పోలీసులు తెలిపారు..కారులోని వ్యక్తి నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు గుర్తించారు.. పవిత్ర శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా వేరే గ్రామంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమానికి హాజరైన వారు తిరిగి తమ ఇళ్లకు వెళ్తున్న సమయంలో మృత్యువు కబలించింది.. తీవ్రంగా విషాదాన్ని నింపింది.. ఈ ప్రమాదంలో చనిపోయిన మృతులను ఉదల్ చౌరాసియా (34), రోహిత్ చౌరాసియా (45), మధు మెహతా (30)గా గుర్తించారు.అదనపు పోలీసు సూపరింటెండెంట్ రిషవ్ గార్గ్ మాట్లాడుతూ, ఈ ఘటనలో ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు మరణించారు, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారు మేదినిరాయ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కు వెళ్లారు.. కేసు నమోదు చేసుకొని మృతులను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.. ఈ సంఘటన తర్వాత డ్రైవర్ కారుతో పరారయ్యాడు.. అతనిని పట్టుకోవడానికి మాన్‌హాంట్ ప్రారంభించబడింది.. త్వరలోనే అతడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

నార్త్ కరోలినా యూనివర్శిటీలో కాల్పుల కలకలం

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకుల మోత దద్దరిల్లింది. నార్త్ కరోలినా యూనివర్శిటీలో ఓ విద్యార్థి విచక్షణరహితంగా కాల్పులకు జరిపాడు.కాగా, ఈ కాల్పుల్లో యూనివర్శిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ మృతి చెందాడు. మరో ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని కాల్పులకు తెగబడ్డ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాల్పులు జరపడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. కాగా, యూనివర్శిటీలో కాల్పుల కలకలం రేపడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అధికారులు యూనివర్శిటీకి లాక్ డౌన్ ప్రకటించారు.

*  గచ్చిబౌలిలో విషాదం

గచ్చిబౌలిలో విషాదం చోటు చేసుకుంది. గచ్చిబౌలి పీయస్ పరిధిలో ఓ వివాహితపై అత్యాచారం ఆపై హత్య చేసారు కొంత మంది దుండగులు. ఈ సంఘటన ఇవాళ వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… నానక్ రాంగూడ ఫైనాన్సిషయల్ డిస్ట్రిక్ట్ లోని ఓ నిర్మాణ సంస్థలో మహిళ పై అత్యాచారం చేశారు కొంత మంది దుండగులు.ఆ తర్వాత హత్య కూడా తెగబడ్డారు. గౌలిదొడ్డి కేశవనగర్ వడ్డెర బస్తీ కీ చెందిన మహిళగా గుర్తించారు పోలీసులు. కాశమ్మ w/o సాంబయ్య 38 అని తెలిపారు. వేస్ట్ మెటీరియల్ తీసుకొవడానికి శుక్రవారం నిర్మాణ సంస్థ కు వచ్చిన మహిళను రేప్ చేసి అనంతరం బండరాయి తో మోదీ చంపారు గుర్తు తెలియని దుండగులు. ఇక శుక్రవారం గచ్చిబౌలి పీయస్ లో మిస్సింగ్ కేసు నమోదు అయింది.మృతురాలికి ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ ఉన్నారని సమాచారం. ఇక దీనిపై కేసు నమోదు చేసుకుని.. ఆ దుండగుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.

ఇంద్రకీలాద్రిపై ఇస్మార్ట్ దోపిడీ

ఇంద్రకీలాద్రికి విచ్చేసే భక్తులు అమ్మవారికి వివిధ రూపాల్లో మొక్కులు చెల్లిస్తుంటారు. కొందరు అమ్మవారికి చీరలు సమర్పిస్తే.. మరికొందరు రవికలు సమర్పిస్తుంటారు. భక్తులు తమకు కావాల్సిన చీరలు, రవికలను ఆలయ పరిసరాల్లోని ఏర్పాటు చేసిన దుకాణాల్లో కొనుగోలు చేస్తారు. అయితే అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కనకదుర్గనగర్‌, మహా మండపం 5వ అంతస్తులోని దుకాణాల్లో రవికల పేరిట గుడ్డ పీలికలను అందమైన ప్లాస్టిక్‌ కవర్లలో ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌ నుంచి వచ్చిన దంపతులు అమ్మవారికి రవికను సమర్పించేందుకు మహా మండపం ఐదో అంతస్తులోని షాపునకు వెళ్లి రూ. వంద చెల్లించి రవికను కొనుగోలు చేశారు. 10 రూపాయలు చెల్లించి పసుపు, కుంకుమ ప్యాకెట్‌ను కొన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం దేవస్థాన కౌంటర్‌లో ఆ రవికను ఇచ్చారు. అయితే దేవస్థాన కౌంటర్‌లోని సిబ్బంది అది చెత్తలో వేయాలని సూచించారు. దీంతో షాక్‌కు గురైన వారు విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయారు. తమకు విక్రయించినది రవిక ముక్క కాదని, కనీసం ఖర్చీపు కూడా కాదని తెలుసుకున్నారు. అడిగినంత ఇస్తున్నా.. ఆలయ ప్రాంగణంలోనే ఇలా భక్తులను మోసం చేయడం ఎంత వరకు సబబని కౌంటర్‌లో సిబ్బందిని నిలదీశారు. దీనిపై మీరు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయాలని వారికి సూచించారు. ప్రతి నిత్యం ఇలా వందలాది మంది భక్తులను మోసం చేస్తున్న వ్యాపారులపై ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

పశ్చిమ బెంగాల్ నడియా జిల్లాలో దారుణం

మనుషుల ప్రాణాలకు విలువ లేకుండా పోతుంది. ఏ దోమనో, చీమనో చంపినంత ఈజీగా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ఏ వయసువారైనా బెదురు లేకుండా ప్రాణాలు తీసేస్తున్నారు. శిక్ష గురించి భయపడటం లేదు, పాపం పుణ్యం అని ఆలోచించడం లేదు. ఇక మానవ్వతం అయితే మచ్చుకైనా కనిపించడం లేదు. టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆలోచనా విధానం ఉన్నతంగా మారాలి. కానీ ఇప్పుడు యూట్యూబ్ లు, సినిమాలు, సీరియల్స్ చూసి హత్యలు కూడా చాలా ఈజీగా చేసేస్తున్నారు. ఆన్ లైన్ గేమింగ్ కోసం అయితే కొంత మంది ప్రాణాలు తీసేకుంటున్నారు లేదా ఇతరుల ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ లో తన తోటి స్నేహితుడిని డబ్బల కోసం చంపేశారు 8 వ తరగతి చదువుతున్న విద్యార్థులు.పశ్చిమ బెంగాల్ నడియా జిల్లాలో దారుణం జరిగింది. తమ తోటి స్నేహితుడినే డబ్బుల కోసం కిడ్నాప్ చేసి హత్య చేశారు ముగ్గురు 8 వ తరగతి విద్యార్థులు. తమ కొడుకు స్నేహితులను కలవడానికి వెళ్లి తిరిగి రాలేదని అతని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు ముగ్గురును అరెస్ట్ చేశారు. ఇక ముగ్గురు విద్యార్థులు తమ స్నేహితుడిని రమ్మని పిలిచారు. దీంతో ఆ బాలుడు శుక్రవారం సైకిల్ తో స్నేహితుల వద్దకు వెళ్లాడు. వారు అతడిని కిడ్నాప్ చేసి ఇంట్లో వారికి కాల్ చేసి మూడు లక్షలు కావాలని డిమాండ్ చేశారు. లేదంటే వారి కొడుకును చంపేస్తామని బెదిరించారు. ఆ వచ్చిన డబ్బుతో ఒక గేమింగ్ ల్యాప్ టాప్ కొనాలని వారు ఫథకం వేశారు. అయితే డబ్బులు ఇచ్చేందుకు బాలుడి ఇంటిలోని వారు నిరాకరించారు.దీంతో ఆ ముగ్గురు కలిసి స్నేహితుడని కూడా చూడకుండా బాలుడిని చంపేశారు. అయితే చంపేముందు బాలుడి చివరి కోరికను అడిగి అతడికి రసగుల్లాలు, కూల్ డ్రింక్ తినిపించి మరీ చంపేశారు. చిన్న పిల్లలు ఇంతటి దారుణానికి పాల్పడటంతో అక్కడ ఉన్న వారందరూ షాక్ కు గురయ్యారు. ఇప్పుడే ఇలా ఉన్నారంటే పెద్దయ్యాక ఎంతటి దారుణానికి పాల్పడతారో అని భయపడుతున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ముగ్గురుని అరెస్ట్ చేసిన పోలీసులు జువెలిన్ కోర్టుకు హాజరుపరిచారు.

తోటి విద్యార్థిని కిడ్నాప్ చేసి, గొంతుకోసి చంపిన క్లాస్ మేట్స్

పశ్చిమ బెంగాల్‌ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తోటి విద్యార్థిని కిడ్నాప్ చేసి.. తల్లిదండ్రులు తాము అడిగిన మొత్తం ఇవ్వలేదని గొంతుకోసి చంపేశారు ముగ్గురు సహవిద్యార్థులు. దారుణమైన ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లోని నదియాలో వెలుగు చూసింది. ముగ్గురు విద్యార్థులు తమతోపాటు చదువుకునే ఒక విద్యార్థిని కిడ్నాప్ చేశారు. ఆ తరువాత అతని కుటుంబానికి ఫోన్ చేసి రూ. 3 లక్షలు డిమాండ్ చేశారు. వారు ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో ముగ్గురు సహవిద్యార్థులు అతని గొంతు కోసి చంపారు. విద్యార్థి చివరి కోరికగా..అతడికి కిడ్నాపర్లు రసగుల్లాలు, కూల్ డ్రింక్స్ అందించారు.పిల్లల్లో పెరిగి పోతున్న నేరప్రవృత్తికి ఈ ఘటన అద్దం పడుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో 8వ తరగతి విద్యార్థిని అతని సహవిద్యార్థులు ముగ్గురు కిడ్నాప్ చేసి, ఆపై గొంతు కోసి చంపారు.కిడ్నాపర్లు చిన్నారి చివరి కోరికను తీర్చేందుకు చంపేముందు ‘రసగుల్లాస్’ (బెంగాలీ స్వీట్ డిష్), కూల్ డ్రింక్స్ కూడా అందించారు. మృతి చెందిన విద్యార్థిని కుటుంబీకులు తమ బిడ్డ కనిపించడం లేదని కృష్ణానగర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది కుటుంబసభ్యుల కథనం ప్రకారం, శుక్రవారం నాడు బాధితుడైన విద్యార్థి తన స్నేహితులను కలవడానికి సైకిల్‌ మీద బయలుదేరి ఇంటినుంచి వెళ్లాడు. ఆ తరువాత ఇంటికి తిరిగి రాలేదు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాధితుడితో సహా ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన విద్యార్థులు గేమింగ్ ల్యాప్‌టాప్ కొనుగోలు చేసేందుకు బాలుడి కుటుంబం నుంచి రూ.3 లక్షలు డబ్బు డిమాండ్ చేశారు. అయితే, కిడ్నాపర్ల డిమాండ్లను కుటుంబ సభ్యులు తీర్చకపోవడంతో, వారు విద్యార్థిని గొంతు కోసి చంపారు.చంపేముందు ఆ ముగ్గురు… బాధిత విద్యార్థిని చివరి కోరిక ఏమిటని అడిగారు. అతని చివరి కోరిక నెరవేర్చడానికి రసగుల్లా, కూల్ డ్రింక్స్ తెచ్చిచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో వేసి నిర్జన ప్రదేశంలో పడేశారు. గాలింపు చేపట్టిన పోలీసులకు మృతదేహం దొరికింది. నిందితులపై జువైనల్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటన అనంతరం స్థానికులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తెచ్చారు.

హైదరాబాద్‌లో మహిళపై అత్యాచారం

 హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో దారుణం జరిగింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళపై అత్యాచారం చేసి అనంతరం బండరాయితో మోది దుండగులు కిరాతకంగా హత్య చేసినట్లు ఘటన స్థలంలో ఆనవాళ్లు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి స్థానికుల నుండి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కాగా, మృతురాలిని గౌలిదొడ్డిలోని కేశవనగర్‌కు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. నిర్మాణంలో ఉన్న ఈ భవనంలోకి మృతురాలు వేస్ట్ మెటీరియల్ తెచ్చుకునేందుకు వెళ్లినట్లు సమాచారం. ఈ నెల 25 నుండి మహిళ కనబడటం లేదని పీఎస్‌లో మిస్సింగ్ కేస్ నమోదు అయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మహిళా సెక్యూరిటీ గార్డుపై సూపర్ వైజర్ అత్యాచారం

మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. చదువుకునే చోట, పని చేసే చోట ఆమెపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్నాయి. చిన్నారులు, ముసలి వాళ్లు అని కూడా చూడకుండా కామాంధులు వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. పరిచయం ఉన్న వారే కదా అని నమ్మి వెళ్తే అత్యాచారానికి ఒడిగడుతున్నారు. తమ కింద పని చేసే ఉద్యోగి అని కూడా చూడకుండా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. మహిళా సెక్యూరిటీ గార్డుపై సూపర్ వైజర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘజియాబాద్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో బాధితురాలు మరణించింది. ‘ఇండియా టుడే’ కథనం, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్ లోని ఓ హౌసింగ్ సొసైటీలో జార్ఖండ్ కు చెందిన యువతి (19) సెక్యూరిటీ గార్డుగా పని చేస్తోంది. తన అత్తతో కలిసి ఆమె జీవిస్తోంది. కాగా.. అదే హౌసింగ్ సొసైటీలో 32 ఏళ్ల అజయ్ సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు. కాగా.. ఆదివారం ఆ యువతిపై అజయ్ లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితురాలు అస్వస్థతకు గురైంది. తోటి కార్మికులు ఆమెను ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో సోమవారం ఆమె మరణించింది. అయితే,సొసైటీ బేస్మెంట్లో ముగ్గురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిని తట్టుకోలేక బాధితురాలు విషం తాగారని, దీంతో ఆమెను ఆసుపత్రిలో చేర్చారని పేర్కొన్నారు. కాగా.. ఆ యువతిపై సామూహిక అత్యాచారం జరగలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై సెక్షన్ ఆఫ్ రేప్ (376 ఐపీసీ) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు డీసీపీ వివేక్ చంద్ యాదవ్ తెలిపారు. బేస్మెంట్ లోపల ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పోలీసులు సేకరించారని, ఇందులో సామూహిక అత్యాచారం జరగలేదని ఆయన చెప్పారు. అయితే బాధితురాలు విషం తాగి చనిపోయిందా లేక ఊపిరితిత్తుల వ్యాధి వల్ల చనిపోయిందా అనే విషయాన్ని నిర్ధారించడానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపినట్లు ఆయన పేర్కొన్నారు.