Business

టీచర్ల బదిలీలకు షెడ్యూల్‌

టీచర్ల బదిలీలకు షెడ్యూల్‌

ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను విద్యాశాఖ ఖరారు చేసింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబరు 3 నుంచి 5 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు తీసుకోనుండగా.. 8, 9 తేదీల్లో సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. గత మార్చిలో దరఖాస్తులు సమర్పించినవారు సైతం వివరాల్లో సవరణలు చేసుకోవచ్చు. గతంలో దరఖాస్తు చేయనివారు బదిలీ కోసం కొత్తగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారం సమర్పించవచ్చు.

ముఖ్య తేదీల వివరాలు ఇలా..

* సెప్టెంబరు 12, 13 తేదీల్లో గ్రేడ్-2 హెచ్ఎంల బదిలీలకు వెబ్ ఆప్షన్లు.

*  సెప్టెంబరు 15న గ్రేడ్-2 ప్రధాన ఉపాధ్యాయుల బదిలీలు.

*  సెప్టెంబరు 17 నుంచి 19 వరకు స్కూల్ అసిస్టెంట్లకు హెచ్‌ఎంగా పదోన్నతులు.

*  సెప్టెంబరు 20, 21 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ బదిలీలకు వెబ్ ఆప్షన్లు.

*  సెప్టెంబరు 23, 24న స్కూల్ అసిస్టెంట్ల బదిలీలు.

*  సెప్టెంబరు 26 నుంచి 28న ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి.

*  సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 1 వరకు ఎస్జీటీల బదిలీలకు వెబ్ ఆప్షన్లు.

*  అక్టోబరు 3న ఎస్జీటీల బదిలీ.

*  అక్టోబర్‌ 5 నుంచి 19 వరకు అప్పీళ్లకు అవకాశం.