ScienceAndTech

ఈ శామ్‌సంగ్ టీవీ ధర అక్షరాల కోటి రూపాయిలు

This 110inches microled samsung tv costs 150K USD

సౌత్ కొరియన్‌ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ భారత మార్కెట్లోకి ప్రీమియం టీవీని లాంచ్‌ చేసింది. సామ్‌సంగ్‌ మైక్రో ఎల్‌ఈడీ టీవీని తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ టీవీలో 110 ఇంచెస్‌తో కూడిన 4కే డిస్‌ప్లేను అందించారు. ఎం1 ఏఐ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ టీవీలో డాల్బీ అట్మాస్‌, ఓటీఎస్‌ ప్రో, క్యూ సింఫనీ వంటి అధునాతన ఫీచర్లను అందించారు. 24.8 మిలియన్ల మైక్రోమటీర్‌ సైజపున్న ఎల్‌ఈడీలు ఈ టీవీ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

ఈ టీవీ ధర ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం , 110 ఇంచెస్‌ మైక్రో ఎల్ఈడీ టీవీ ధర అక్షరాల రూ. 1,14,99,000గా ఉంది. ఈ స్మార్ట్‌ టీవీని సామ్‌సంగ్‌ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, రిటైల్‌ స్టోర్‌లో కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ టీవీ సేల్‌ ఎప్పుడన్నదానిపై మాత్రం ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 24.8 మిలియన్ల మైక్రో ఎల్‌ఈడీలతో ఈ స్క్రీన్‌ను అందించారు. మెరుగైన క్లారిటీ, కాంట్రాస్ట్‌తో ఈ టీవీలో అద్భుతమైన వ్యూయింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తుంది. ఈ స్మార్ట్‌ టీవీ బెజెల్స్‌ ఇన్‌విబిబుల్‌గా ఉండడం విశేషం. స్క్రీన్‌ అంచులు కూడా చాలా సన్నగా డిజైన్‌ చేశారు. దీంతో పాటు ఈ టీవీలో ఆర్ట్‌ మోడ్‌ను అందించారు. ఈ ఫీచర్‌ సహాయంతో ఆర్ట్‌ డిజైన్‌గా మార్చుకోవచ్చు. మైక్రో ఏఐ ప్రాసెసర్‌, మైక్రో హెచ్‌డీఆర్‌, మైక్రో కలర్‌ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో అందించారు. ఆడియో పరంగా ప్రత్యేకంగా 6.2.2 ఛానెల్‌ సిస్టం ఉన్న 100 వాట్స్‌ ఆర్‌ఎంఎస్‌ సౌండ్‌ సిస్టమ్‌ను అందించారు. ఇక ఈ టీవీ డైమెన్సెన్స్‌ విషయానికొస్తే 2.49 సెంటీమీటర్లుగా ఉంది. టీవీ బరువు స్టాండ్‌ లేకుండా 87 కిలోలు ఉంటుంది.

Buy here: https://www.samsung.com/us/televisions-home-theater/tvs/micro-led/110-class-micro-led-samsung-4k-with-smart-hub-mna110ms1acxza/