Business

భవనాన్ని అమ్మిన విప్రో. నష్టాల్లో ఉందనుకుని షేర్లు పతనం.

భవనాన్ని అమ్మిన విప్రో. నష్టాల్లో ఉందనుకుని షేర్లు పతనం.

తమిళనాడులోని 20 ఏళ్ల నాటి భవనంతో పాటు 14 ఎకరాల భూమిని విక్రయించినట్లు ఐటీ కంపెనీ విప్రో ఇటీవల ప్రకటించింది. చెన్నైలోని షోలింగనల్లూరు ఐటీ కారిడార్‌లో దాదాపు 5,89,778 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనాన్ని రూ. 266.38 కోట్లకు కాసాగ్రాండ్ బిజ్‌పార్క్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విక్రయించినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. విప్రో తన ఆస్తులను విక్రయించిన తరువాత కంపెనీ షేర్స్ అన్నీ కూడా వరుస నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. 2023 – 24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ రూ. 2870.10 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కాగా గత ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభం రూ. 2563.60 కోట్లు. ఈ లెక్కన 2022 కంటే 2023 లో కంపెనీ ఆదాయం 12 శాతం పెరిగింది.