NRI-NRT

డెట్రాయిట్‌లో తానా ప్రతినిధులకు సన్మానం

డెట్రాయిట్‌లో తానా ప్రతినిధులకు సన్మానం

తానా సంస్థ ప్రధాన కార్యాలయం డెట్రాయిట్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయంలో ఉంది. ఈ ఆలయ ట్రస్ట్ బోర్డులో తానా నుండి ఒక సభ్యుడిని ప్రతినిధిగా నియమిస్తారు. 2023-25 కాలానికి గానూ తానా తరఫున డెట్రాయిట్‌లోని శ్రీ వేంకటేశ్వర ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా బేతంచర్ల ప్రసాద్ నియమితులయ్యారు. బ్లూమ్‌ఫీల్డ్ హిల్స్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రసాద్‌ను తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ చేతుల మీదుగా ప్రవాసులు సత్కరించారు. గడిచిన దశాబ్ద కాలంగా ఆలయానికి విశేష సేవలు అందించిన ప్రసాద్‌ను ఈ పదవి వరించడం పట్ల అతిథులు హర్షం వెలిబుచ్చారు.

తానా కార్యాలయ సంచాలకుడు కోడూరు చలపతి, సాంస్కృతిక విభాగ అధ్యక్షురాలు గొంది మను, వెబ్‌సైట్ ఉపాధ్యక్షుడు దేవబత్తిని హరి తదితరులను కూడా ఈ కార్యక్రమంలో సత్కరించారు. కార్యక్రమంలో సన్నీరెడ్డి, యద్దం బాలాజీ, బడ్డి అశోక్, ట్రాయి తెలుగు సంఘం ప్రతినిధులు చెంచు రెడ్డ్, ఆలపాటి కృష్ణ ప్రసాద్, జంపాల విష్ణు తదితరులు పాల్గొన్నారు.

TANA Reps Felicitated In Detroit
TANA Reps Felicitated In Detroit
TANA Reps Felicitated In Detroit
TANA Reps Felicitated In Detroit

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z