Sports

గోవాలో రేపు ప్రారంభం కానున్న జాతీయ క్రీడలు

గోవాలో రేపు ప్రారంభం కానున్న జాతీయ క్రీడలు

గోవాలో రేపు (గురువారం) జాతీయ క్రీడల సంరంభం మొదలు కానుంది. గోవా రాష్ట్రం జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. గోవాలోని ఐదు ప్రధాన నగరాల్లో రెండేసి ప్రదేశాల చొప్పున మొత్తం 10 ప్రాంతాల్లో ఈ 37వ ఎడిషన్‌ జాతీయ క్రీడలు జరుగనున్నాయి. దాదాపు 10 వేల మంది క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొననున్నారు. సుమారు 2.5 లక్షల మంది ప్రేక్షకులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. అక్టోబర్‌ 26న ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ జాతీయ క్రీడలు.. నవంబర్ 9న ముగియనున్నాయి.గోవాలోని మపుసా, మార్గావ్‌, పంజిమ్‌, పోండా, వాస్కో నగరాలు ఈ జాతీయ క్రీడల కోసం క్రీడా గ్రామాలుగా మారిపోయాయి. గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ బుధవారం ఈ క్రీడా గ్రామాల్లో పర్యటించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ 37వ ఎడిషన్‌ జాతీయ క్రీడల్లో 10 వేల మంది ఆటగాళ్లు 43 క్రీడా విభాగాల్లో పోటీ పడనున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z