Editorials

పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి సెటైర్లు-తాజా వార్తలు

పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి సెటైర్లు-తాజా వార్తలు

* పురంధేశ్వరిపై విజయసాయిరెడ్డి సెటైర్లు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఆమె నిలకడలేని నాయకురాలు అని ఎద్దేవా చేశారు. బీజేపీలో పార్టీ ప్రయోజనాలు కోసం కాకుండా సొంత ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని విమర్శించారు. కుటుంబం గురించి మాత్రమే ఆమె ఆలోచిస్తారని, ప్రజల కోసం కాదన్నారు. మద్యం ఆదాయంలో వైసీపీ నేతలపై ఆరోపణలు చేసే ముందు పురంధేశ్వరి ఆధారాలు సేకరించుకోవాలని సూచించారు. మద్యం విషయంలో తనపై, ఎంపీ మిథున్ రెడ్డిపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనకు మద్యం, నాన్ వేజ్ అలవాటు లేదని తెలిపారు. ఏపీలో ఉన్న లిక్కర్ బ్రాండ్స్ ఏమున్నాయో తనకు తెలియదని చెప్పారు. పురంధేశ్వరికి ఎంత తెలుసో తనకు తెలియదని సెటైర్స్ వేశారు. తనపై పురంధేశ్వరి సంబంధం లేని ఆరోపణలు చేయడం సరికాదని విజయసాయిరెడ్డి తెలిపారు.

* త్వరలో ముఖ్యమంత్రి పీఠంపై డీకే

మరో రెండున్నరేండ్ల తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి పీఠంపై ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ కూర్చుంటారని అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రవికుమార్‌ గౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారమిక్కడ ఆయన మాట్లాడుతూ ‘రెండున్నర సంవత్సరాల తర్వాత శివకుమార్‌ సీఎం అవుతారు.ఇందులో రెండో మాటకు తావులేదు. ఆయన పార్టీ కోసం కష్టపడ్డారు. ఈ విషయంలో ఎలాంటి సందిగ్ధత లేదు’ అని పేర్కొన్నారు. 2019లో కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టిన ఓ గుంపు.. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50 కోట్లు, మంత్రి పదవి ఆశచూపుతున్నదని తెలిపారు.

* చంద్రబాబు నాయుడు చరిత్ర ముగిసింది:విజయసాయి రెడ్డి

వైసీపీ నాలుగున్నరేళ్ళ పాలనలో చేపట్టిన సామాజిక సాధికారత గురించి ప్రజలకు వివరించే కార్యక్రమమే ఈ యాత్ర అని రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి అన్నారు. 175 నియోజక వర్గాల్లో ఈ యాత్ర జరుగుతుంది.. వైసీపీ పెత్తందార్ల పార్టీ కాదు ప్రజల పార్టీ అంటూ ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రి హయాంలో సామాన్య ప్రజలకు చేసింది ఏం లేదు అని విమర్శించారు. చంద్రబాబు ప్రజలకు ద్రోహం చేశాడు కాబట్టే జైలులో ఉన్నాడు.. ఆయన్ని ప్రజలు పట్టించుకోవటం లేదు అంటూ ఎంపీ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.చంద్రబాబు నాయుడు చరిత్ర ముగిసింది అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శించారు. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు ఏవి లోకేష్ కి లేవు అని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న తీసుకున్న సాహసోపేత నిర్ణయాలను చూసి ప్రతి పక్షాలు ఓర్వలేక పోతున్నాయి.. పురందేశ్వరి గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నారు.. ఆ తర్వాత బీజేపీ పార్టీలోకి వచ్చారు.. ఆమెకి సిద్దాంతాలు, నైతిక విలువలు లేవు అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబ ప్రయోజనాలకు, తన సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తుంది.. పురంధేశ్వరి అరోపరణలు అర్థరహితమైనవి.. నాపై, మిథున రెడ్డిపై పురంధేశ్వరి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు.. పురంధేశ్వరి మందు తాగుతారో లేదో నాకు తెలియదు గానీ నాకు మద్యం అలవాటు అయితే లేదు.. వాటి బ్రాండ్లు కూడా నాకు తెలియవు.. నేను తప్పు చేస్తే ఆ భగవంతుడే శిక్షిస్తాడు అంటూ విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు.

* ప్రొద్దుటూరులో టీడీపీ నేతలు వీరంగం

జిల్లాలోని ప్రొద్దుటూరులో టీడీపీ నేతలు వీరంగం చేశారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు బెనర్జీపై కత్తులతో దాడికి పాల్పడ్డారు. బెనర్జీకి తీవ్ర గాయాలవ్వగా.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దాడికి తెగబడిన వ్యక్తిని టీడీపీ ఇంచార్జి ప్రవీణ్‌ ముఖ్య అనుచరుడు భరత్‌గా గుర్తించారు.

* కేసీఆర్‌కు పొంగులేటి సవాల్

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయని పార్టీ ముఖ్యనేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఆవశ్యకత, అవసరం, ప్రజలను ఎంత ఇబ్బంది పెట్టిందో చెప్పబోతున్నామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఫలితాలుంటాయని జోస్యం చెప్పారు. నిన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పాలేరులో అవాకులు చెవాకులు పేలారు.. దానికి తుమ్మల గట్టిగానే ఇచ్చారని అన్నారు. నా పేరు ప్రస్తావించకుండా నన్ను టార్గెట్ చేసి మాట్లాడారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా డబ్బు మదం అనే పదాలు వాడారు. అసలు ప్రజాస్వామ్యం అంటే అర్థం కేసీఆర్‌‌కు తెలుసా? అని ప్రశ్నించారు.పాలేరు సభలో కేసీఆర్ పక్కన కూర్చున్న వాళ్ళు ఏ పార్టీలో గెలిచారో తెలిసే మాట్లాడారా? అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌లో గెలిచిన వారిని పక్కన పెట్టుకొని నీతులు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. నాలుగు కాంట్రాక్టులు, పైరవీలు చేసి తాము డబ్బు సమపాదించలేదు. దమ్ముంటే నిరూపించాలి. తాను తడిబట్టలతో వస్తా.. మీరు వస్తారా..? అని సీఎం కేసీఆర్‌కు పొంగులేటి సవాల్ చేశారు. పాలేరు సభలో తుమ్మల పేరు ప్రస్తావించారు.. కాబట్టి సరిపోయింది. నా పేరు ఎత్తుకుంటే తెలిసేది నా సత్తా ఏంటో అని అన్నారు. ఇప్పటికీ తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నా.. ఉమ్మడి ఖమ్మంలో ఒక్క బీఆర్ఎస్ అభ్యర్థిని గెలవనిచ్చేది లేదు అని అన్నారు. కాంగ్రెస్‌కు 80 నుంచి 82 సీట్లు వస్తున్నాయి.. ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని జోస్యం చెప్పారు.

* తుమ్మలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి పువ్వాడ

ఖమ్మం జిల్లాలో డైలాగ్ వార్ తో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. పదవుల కోసం తుమ్మల నాగేశ్వరరావు నీచస్థాయికి పడిపోయారని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. నిన్న ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభపై కేసీఆర్ పై తుమ్మల కామెంట్స్ చేయగా.. మంత్రి అజయ్ తుమ్మలకు కౌంటర్ ఇచ్చారు. తుమ్మల వల్ల కేసీఆర్ కు లాభం రాలేదని… కేసీఆర్ వల్లే.. తుమ్మల లబ్దిపొందారన్నారు. 2014లో ఓడిపోతే పిలిచి పదవి ఇస్తే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సిగ్గుచేటు అని తుమ్మలపై అజయ్ ఫైర్ అయ్యారు.

* అమిత్‌షాపై ఓవైసీ ఫైర్

అమిత్ షా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి అవుతారంటూ కీలక ప్రకటన చేశారు. అయితే దీనిపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. బీజేపీకి సమాజంపై అంత శ్రద్ధ ఉంటే బీసీ కులగణణ ఎందుకు నిర్వహించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే వెనుకబడిన తరగతి (బీసీ) నాయకుడిని ముఖ్యమంత్రిగా చేస్తామని సూర్యాపేటలో జరిగిన ర్యాలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన ఒక రోజు తర్వాత అసదుద్దీన్ ఈ వ్యాఖ్యలు చేశారు.శుక్రవారం రాత్రి జహీరాబాద్ సభలో మాట్లాడిన ఓవైసీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కవలలు అంటూ విమర్శించారు. ఈ రెండు కూడా తెలంగాణలో విజయం సాధించలేవని ఆయన అన్నారు. ‘‘ అమిత్ షా గారు, మీకు బాధ్యతతో చెబుతున్నాను, మీరు కాంగ్రెస్ కవలలు అయ్యారు. తెలంగాణలో ప్రజలు మీకు అనుకూలంగా లేరు. మీకు బైబై చెబుతారు’’ అంటూ ఓవైసీ అన్నారు.పార్లమెంట్‌లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ, ముస్లిం మహిళలకు సబ్‌ కోటా కల్పించాలన్న తన డిమాండ్‌కు ప్రధాని మోదీ గానీ, కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీ గానీ మద్దతు ఇవ్వలేదని ఒవైసీ పేర్కొన్నారు. బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ప్రస్తావిస్తూ.. బీజేపీ వాషింగ్ మిషన్‌గా మారిందా..? అని ప్రశ్నించారు.బీజేపీతో ఎంఐఎంకి సంబంధం ఉందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్ని ప్రస్తావిస్తూ.. 2019 ఎన్నికల్లో అమేథిలో ఆయన ఎలా ఓడిపోయారని అడిగారు. 2019లో బీజేపీ, కాంగ్రెస్ 185 స్థానాల్లో ప్రత్యక్ష పోటీలో ఉన్నాయని, ఆ ప్రాంతాల్లో ఎంఐఎం పోటీ చేయలేదని, కాంగ్రెస్ 16 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిందని ఆయన ప్రస్తావించారు.వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం పోటీ లేని చోట టీఆర్ఎస్ కి మద్దతు ఇవ్వాలని ప్రజలకు సూచించారు. ప్రాంతీయ పార్టీలు ఎక్కడున్నా ప్రజలకు ప్రాధాన్యత ఇస్తారని ఓవైసీ అన్నారు. బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ అధికారంలోకి వస్తే మీ సమస్యలపై స్పందించే వారే ఉండరని ఆయన అన్నారు.

* శ్రీవారిని ద‌ర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ద‌ర్శించుకున్న ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీర‌జ్‌సింగ్ ఠాకూర్, ధీరజ్‌ సింగ్ ఠాకూర్‌కు స్వాగతం పలికిన తితిదే అధికారులు, అనంతరం ఆయనకు స్వామివారి చిత్రపటం అందించిన తితిదే అధికారులు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z