Politics

ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వరుస షాక్‌లు

ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వరుస షాక్‌లు

అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా బోధన్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి షకీల్‌కు, ఎల్లారెడ్డిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి జాజాల సురేందర్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్నారు. దీంతో, ఇద్దరు నేతలకు నిరసన సెగ తగిలింది.

వివరాల ప్రకారం.. ఎడపల్లి మండలంలో ఏఆర్పీ క్యాంపులో షకీల్‌ ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌లు ఇవ్వకుండా ఎందుకు గ్రామంలోకి వచ్చారని షకీల్‌ను నిలదీశారు. ఈ క్రమంలో గ్రామస్తులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది.

ఇక, షకీల్‌కు నిరసన సెగపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ క్రమంలో కవిత మాట్లాడుతూ.. బోధన్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు, కార్యకర్తలపై దాడిని కవిత తీవ్రంగా ఖండించారు. ఓటమికి భయపడే బీఆర్‌ఎస్‌ శ్రేణులపై దాడులు చేస్తున్నారు. దాడి చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. 60 లక్షల మంది గులాబీ సైన్యం ముందు మీరెంత?. సత్తా కలిగిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు.. ప్రజాక్షేత్రంలో దాడులను ధీటుగా ఎదుర్కొంటారు. ఇలాంటి దాడులకు తెగబడితే కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని ఘాటు విమర్శలు చేశారు.

మరోవైపు.. ఎల్లారెడిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సురేందర్‌కు సైతం నిరసన సెగ తగింది. లక్ష్మాపూర్‌లో సురేందర్‌ ఎన్నికల ప్రచారాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్బంగా గడిచిన ఐదేళ్లలో సమస్యలు పట్టించుకోలేదని గ్రామస్తులు నిరసనకు దిగారు. ఊరి మీదుగా వెళ్తూ కనీసం ఒక్కసారి కూడా ఆగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, గ్రామస్తులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z