Business

విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా పలు రైళ్లు రద్దు

విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా పలు రైళ్లు రద్దు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ రైల్వే డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 4వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు విజయవాడ రైల్వే డివిజన్‌ అధికారులు ప్రకటించారు.

  • నవంబర్‌ 27 నుంచి డిసెంబర్‌ 3 వరకు రద్దైన రైళ్లు ఇవే..
  • గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్‌ (17243)
  • గుంటూరు-విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (17239)
  • మచిలీపట్నం-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17219)
  • కాకినాడ-విశాఖ మెమూ స్పెషల్‌ (17267)
  • విశాఖ-కాకినాడ మెమూ స్పెషల్‌ (17268)

నవంబర్‌ 28 నుంచి డిసెంబర్‌ 4 వరకు రద్దైన రైళ్లు ఇవే..

  • రాయగడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (17244)
  • విశాఖ-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (17240)
  • విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ (17220)
  • నవంబర్‌ 27, 28, 29, డిసెంబర్‌ 1, 2 తేదీల్లో మరో 2 రైళ్లను విజయవాడ రైల్వే డివిజన్ రద్దు చేసింది. విజయవాడ-విశాఖ (22702), విశాఖ-విజయవాడ ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ (22701) వాటిలో ఉన్నాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z