Devotional

శ్రీశైలం ఆలయం ప్రాంగణంలో త్రాచు పాము కలకలం

శ్రీశైలం ఆలయం ప్రాంగణంలో త్రాచు పాము కలకలం

శ్రీశైలం ఆలయం ప్రాంగణంలో ఎనిమిది అడుగుల భారీ త్రాచు పాము కలకలం రేపింది. కార్తీకమాసం పౌర్ణమి గడియలు దగ్గర పడటంతో భారీ పోడవుగల పాము ఆలయ ప్రాంగణంలోని స్వామివారి గర్భాలయం ఎదురుగా ఉన్న ఉమా రామలింగేశ్వరస్వామి మండపంలో కనపడింది.

నిత్యం భక్తులు తిరిగే ప్రదేశంలో రేపు(నవంబర్ 27) కార్తీక పౌర్ణమి గడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పామును చూసిన భక్తులు స్వయాన దేవతలను చూసినట్లు భక్తి పర్వశంతో ఆచ్చర్యానికి లోనవ్వగా.. మరికొంత మంది భక్తులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన ఆలయ సిబ్బంది స్నేక్ క్యాచర్ రాజాకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచ్చర్ పామును చాకచక్యంగా పామును పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. దీనితో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z