DailyDose

కవలలకు జన్మనిచ్చిన 70 ఏళ్ల బామ్మ

కవలలకు జన్మనిచ్చిన 70 ఏళ్ల బామ్మ

ఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయ (70) అనే వృద్ధురాలు సంతానోత్పత్తి చికిత్స తర్వాత కవల పిల్లలకు జన్మనిచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద వయసు గల నవ మాతృమూర్తిగా నిలిచిన ఈమెకు బుధవారం సిజేరియను ద్వారా ఓ బాబు, పాప పుట్టారు. ఉగాండా రాజధాని కంపాలా నగరంలోని ఆసుపత్రిలో కాన్పు జరిగింది. ‘‘ఆమె ఆరోగ్యంగా ఉన్నారు. చక్కగా మాట్లాడుతూ, నడుస్తున్నారు. ఇక్కడే సఫీనా విట్రో ఫలదీకరణ చికిత్స కూడా పొందారు’’ అని ఆసుపత్రి అధికార ప్రతినిధి ఆర్థర్‌ మ్యాట్సికో శుక్రవారం వెల్లడించారు. సఫీనా 2020లోనూ విట్రో ఫలదీకరణ (ఐవీఎఫ్‌) ద్వారా ఓ కుమార్తెకు జన్మనిచ్చారు. 2019లో దక్షిణ భారతదేశాన 73 ఏళ్ల మహిళకు ఐవీఎఫ్‌ ద్వారా కవల పిల్లలు (అమ్మాయిలు) పుట్టినట్లు గతంలో కథనాలు వచ్చాయి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z