Politics

నాడు జర్నలిస్ట్ – నేడు కాబోయే ముఖ్యమంత్రి

నాడు జర్నలిస్ట్ – నేడు కాబోయే ముఖ్యమంత్రి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీని ఓడించడంతోపాటు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలుపొందడం.. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తరువాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. పీసీసీ చీఫ్‌గా కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించడం వెనుక రేవంత్ రెడ్డి పాత్ర కీలకమని కాబట్టే రేవంత్ రెడ్డియే కాబోయే ముఖ్యమంత్రి అని కూడా ప్రచారం జరుగుతుంది. మరోవైపు సీనియర్ ఎమ్మెల్యే,సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సైతం ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ముఖ్యమంత్రి రేసులో ఉన్న రేవంత్ రెడ్డి గతంలో జర్నలిస్ట్‌గా పనిచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి మూడు దశాబ్దాల క్రితం‘జాగృతి’అనే వార పత్రికలో పని చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z