Politics

కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికవుతారని సమాచారం!

కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికవుతారని సమాచారం!

భారాస శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు తెలిసింది. కొత్తగా ఎన్నికైన భారాస ఎమ్మెల్యేలు శనివారం తెలంగాణ భవన్‌లో సమావేశమై ఈ మేరకు తీర్మానం చేయనున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలను గెలుచుకొని భారాస ప్రతిపక్ష హోదాలో నిలిచింది. పార్టీ అధినేత కేసీఆర్‌కు శస్త్రచికిత్స జరిగిన కారణంగా శనివారం నాటి సమావేశానికి హాజరు కావడం లేదని పార్టీ వర్గాలు తెలిపాయి. మిగిలిన 38 మంది ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించనున్న సమావేశంలో పాల్గొని, కేసీఆర్‌ను తమ పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటూ ప్రవేశపెట్టే తీర్మానాన్ని ఆమోదించనున్నట్లు సమాచారం. అనారోగ్య కారణంగా కేసీఆర్‌ శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయట్లేదు. మిగిలిన ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z