Food

స్వీట్‌ కార్న్‌తో గారెలు తయారీ విధానం

స్వీట్‌ కార్న్‌తో గారెలు తయారీ విధానం

స్వీట్‌ కార్న్‌– తోటకూర గారెలు తయారీకి కావల్సినవి:

లేత స్వీట్‌ కార్న్‌ గింజలు, లేత తోటకూర ఆకులు – రెండున్నర కప్పుల చొప్పున (శుభ్రం చేసి పెట్టుకోవాలి)
అల్లం – కొద్దిగా,వెల్లుల్లి రెమ్మలు – 7,ఉప్పు – తగినంత
జీలకర్ర – ఒక టీ స్పూన్‌,సోంపు – అర టీ స్పూన్‌
ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు (చిన్నగా కత్తిరించుకోవాలి)
బియ్యప్పిండి – పావు కప్పు
పచ్చిమిర్చి – 4 (చిన్నగా తరగాలి),నూనె – సరిపడా

తయారీ విధానమిలా: ముందుగా మిక్సీలో స్వీట్‌ కార్న్, వెల్లుల్లి రెమ్మలు, అల్లం, తోటకూర ఆకులు (కాడల్లేకుండా) బరకగా మిక్సీ పట్టుకోవాలి. అవసరం అయితే కొన్ని నీళ్లు కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని.. జీలకర్ర, సోంపు, బియ్యప్పిండి, ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. మిశ్రమం మరీ జారుగా మారితే బియ్యప్పిండి పెంచుకోవచ్చు. వీటిని చిన్న చిన్న వడల్లా చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z