DailyDose

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇదో సువర్ణావకాశం!

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇదో సువర్ణావకాశం!

జేఈఈ(JEE), నీట్‌ (NEET) వంటి పోటీ పరీక్షలు, రాష్ట్ర స్థాయి ఇంజినీరింగ్‌, ఇతర పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇదో సువర్ణావకాశం! ఐఐటీ ఖరగ్‌పుర్‌తో కలిసి కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ సాథీ (SATHEE – సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌, టెస్ట్‌ అండ్‌ హెల్ప్‌ ఫర్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌) అనే పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తోంది. పోటీ పరీక్షల సన్నద్ధత, జ్ఞానాన్ని మెరుగుపరుచుకొనేందుకు ఉపయోగపడే ఈ వేదిక గురించి అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలను కోరుతూ లేఖలు రాసింది. డిసెంబర్‌ 12 నాటికి దేశ వ్యాప్తంగా 60వేల మందికి పైగా విద్యార్థులు సాథీ(SATHEE)లో రిజిస్టర్‌ అయినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డా. సుభాస్‌ సర్కార్‌ లోక్‌సభలో వెల్లడించారు. ఈ పోర్టల్‌లో జేఈఈకి 45 రోజులు, నీట్‌కు 60 రోజుల క్రాష్‌ కోర్సులతో పాటు మాక్‌ టెస్ట్‌లు, ప్రాక్టీస్‌ క్వశ్చన్లు, వీడియో లెక్చర్స్‌, వెబినార్‌లు అందుబాటులో ఉన్నాయి. రిజిస్ట్రేషన్‌, కోర్సులు, ఇతర వివరాల కోసం ఈ లింక్‌ https://sathee.prutor.ai/sathee-jee/ పై క్లిక్‌ చేయండి.

జేఈఈ, ఇతర ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు సహకరించేలా 45 రోజుల క్రాష్‌ కోర్సును నవంబర్‌ 21 నుంచే ప్రారంభించింది. ఐఐటీ టాపర్లు, విద్యావేత్తలు, సబ్జెక్టు నిపుణులతో ఈ వేదిక ద్వారా కోచింగ్‌ ఇస్తోంది. ఆంగ్లంతో పాటు మొత్తం ఐదు భాషల్లో ఈ కోర్సు అందుబాటులో ఉన్నట్లు కేంద్రం పేర్కొంది . అఖిలభారత సాంకేతిక విద్యా మండలి (AICTE) దీని కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI) ఆధారిత ట్రాన్సిలేషన్‌ టూల్‌ను అభివృద్ధి చేయగా.. ఇది 22 భారతీయ భాషల్లో పనిచేస్తుంది. ఈ టూల్‌ గురించి, దాని వినియోగంపై పలు విద్యా సంస్థలు/కాలేజీల్లో వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు నిర్వహించినట్లు కేంద్రం తెలిపింది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z