Movies

ఏషియన్ వీక్లీ న్యూస్ ‘ఈస్టర్న్ ఐ 2023’ టాప్ 50లో ఎన్టీఆర్‌

ఏషియన్ వీక్లీ న్యూస్ ‘ఈస్టర్న్ ఐ 2023’ టాప్ 50లో ఎన్టీఆర్‌

‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న హీరో ఎన్టీఆర్‌ (NTR).. తాజాగా మరో ఘనతను సాధించారు. 2023లో ఆసియాలో టాప్‌ 50లో నిలిచిన నటుల జాబితాను ‘ఏషియన్‌ వీక్లీ’ మ్యాగజైన్‌ ప్రకటించింది. అందులో తారక్‌ స్థానం దక్కించుకున్నారు. ‘ఈస్టర్న్‌ ఐ 2023’ పేరిట ఈ జాబితాను వెల్లడించగా.. ఎన్టీఆర్‌ 25వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో తెలుగు ఇండస్ట్రీ నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక హీరో తారక్‌ కావడం విశేషం. ఇక ఈ లిస్ట్‌లో షారుక్‌ మొదటి స్థానంలో నిలవగా.. పలువురు బాలీవుడ్‌ నటీనటులు చోటు దక్కించుకున్నారు.

మరోవైపు ఇటీవల అమెరికన్‌ మ్యాగజైన్‌ ‘వెరైటీ’ ప్రకటించిన 500 మంది అత్యంత ప్రభావశీలుర జాబితాలో ఎన్టీఆర్‌, రాజమౌళి చోటు దక్కించుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘దేవర’లో నటిస్తున్నారు. పూర్తి స్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఇది రెండు భాగాల్లో తెరకెక్కుతోంది. ఇందులో తారక్‌ సరసన బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ నటిస్తుండగా.. విలన్ పాత్రలో సైఫ్‌ అలీఖాన్ (Saif Ali Khan) కనిపించనున్నారు. ఇటీవలే గోవాలో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. మొదటి భాగం 2024 ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న ఈసినిమాకు అనిరుధ్‌ స్వరాలు అందిస్తున్నారు. దీంతో పాటు ‘వార్‌2’(War 2) లోనూ ఎన్టీఆర్‌ నటిస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z