Politics

కోర్టులో కేసీఆర్‌కు ఊరట

కోర్టులో కేసీఆర్‌కు ఊరట

2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో గులాబీ బాస్ కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే, ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్ వాస్తవాలను వివరించకుండా గోప్యంగా 2019లో సిద్ధిపేట జిల్లా మామిడ్యాలకు చెందిన టీ. శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ఎన్నికను రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.తాజాగా.. రాష్ట్ర హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. ఈ సందర్భంగా కోర్టులో కేసీఆర్‌కు ఊరట లభించింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. గజ్వేల్ నుంచి 2018లో కేసీఆర్ ఎన్నిక కావడాన్ని సవాల్ చేస్తూ దాఖలపై ఎన్నికల పిటిషన్‌పై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. 2018 ఎన్నికల కాలపరిమితి ముగిసిందని.. దీనిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసినా ఫలితం ఉండదని పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z