DailyDose

శంషాబాద్ విమానాశ్రయంలో సిటీసైడ్ సెల్ఫ్ చెక్-ఇన్ విధానం

శంషాబాద్ విమానాశ్రయంలో సిటీసైడ్ సెల్ఫ్ చెక్-ఇన్ విధానం

శంషాబాద్‌ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించే ప్రయాణికులకు విమానాశ్రయ అధికారులు కొత్త సంవత్సరం సందర్భంగా సిటీసైడ్‌ సెల్ఫ్‌ చెక్‌-ఇన్‌ విధానాన్ని సోమవారం అందుబాటులోకి తీసుకొచ్చారు. విమానాశ్రయంలోని కారు పార్కింగ్‌ ప్రాంతం నుంచే ప్రయాణికులు వారి బోర్డింగ్‌పాస్‌లు, సామగ్రి పాస్‌లను పొందవచ్చు. బోర్డింగ్‌ పాస్‌లు, ప్రయాణికుల లగేజీ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించేందుకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టామని విమానాశ్రయ సృజనాత్మక విభాగం ప్రధాన అధికారి ఎస్‌జీకే కిషోర్‌ తెలిపారు. కారు పార్కింగ్‌ వద్దే ప్రయాణికులు స్వీయ తనిఖీ, పరిశీలన చేసుకోవచ్చు. అక్కడ ఏర్పాటు చేసిన కియోస్క్‌ వద్దకు వెళ్లి విమాన ప్రయాణ వివరాలను చూసుకుని చెక్‌-ఇన్‌ చేసుకోవచ్చు. నిమిషాల వ్యవధిలో బోర్డింగ్‌ పాస్‌ సెల్‌ఫోన్‌కు వస్తుంది. బ్యాగేజీ ట్యాగర్లు వచ్చేస్తాయి. ప్రయాణికులు సెల్ఫ్‌ బ్యాగ్‌ డ్రాప్‌ వద్దకు వెళ్లి కన్వేయర్‌ బెల్ట్‌పై సామగ్రి ఉంచితే అది ప్రాసెస్‌ అవుతుంది. బ్యాగులకు ట్యాగ్‌లను మనమే వేయాల్సి ఉంటుంది. విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు అక్కడే రసీదు కూడా ఇస్తారు. అనంతరం సంబంధిత విమానయానసంస్థకు ధ్రువీకరణ సందేశం వెళ్తుంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z