DailyDose

ఆధార్ వినియోగదారులకు శుభవార్త

ఆధార్ వినియోగదారులకు శుభవార్త

భారత్ లో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు కార్డు ఉంటుంది.. అదే ఆధార్ కార్డు.. మనకు కావలసిన అత్యంత ముఖ్యమైన కార్డులలో ఆధార్ ప్రాముఖ్యత ఎక్కువే..అయితే అటువంటి ఆధార్ విషయంలో తప్పకుండా జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా మన ఆధార్ నెంబర్ ఇతరులకు ఇవ్వడం లాంటిది అసలు చేయకూడదు. ఈ మధ్యకాలంలో కొందరు మోసగాళ్లు ఆధార్ నెంబర్ల ద్వారా అక్రమ మార్గంలో ప్రయోజనాలను పొందుతున్నారు.. మన లావాదేవీలకు సంబందించిన అన్నిటికి ఆధార్ అనేది లింక్ అయ్యి ఉంటుంది..

ఈ మధ్యకాలంలో ఇలా ఆధార్ మోసాలు పెరిగిపోతుండడంతో ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా మాస్క్డ్ ఆధార్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.. మన పర్సనల్ ఇంఫర్మేషన్ ను సెక్యూర్ గా ఉంచుతుంది.. ఈ మాస్క్డ్ ఆధార్ అనేది వ్యక్తుల గోప్యతను మెరుగుపర్చుతుంది. ఆధార్ సమాచారం బహిర్గతం కాకుండా కాపాడుతుంది. ఇంతకీ ఆ ఫీచర్ ఏమిటి అది ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వ్యక్తుల ప్రైవసీని కాపాడటానికి యూఐడీఏఐ మాస్క్డ్ ఆధార్‌ సర్వీస్‌ లాంచ్ చేసింది. దీంట్లో 12 అంకెల ఆధార్‌లో మొదటి 8 అంకెలు X తో కవర్ అయి ఉంటాయి. దీంతో ఆధార్ నంబర్ దుర్వినియోగమయ్యే అవకాశం ఉండదు.. ఈ ఫీచర్ ను ఎలా పొందాలంటే?

ముందుగా https://uidai.gov.in/ ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలోకి వెళ్లి మై ఆధార్ సెక్షన్‌కు వెళ్లి డౌన్‌లోడ్ ఆధార్ ఆప్షనను సెలక్ట్ చేయాలి.

ఆధార్ డౌన్‌లోడ్ పేజీ స్క్రీన్‌ పై కనిపిస్తుంది. ఇక్కడ మీ పూర్తి పేరు, పిన్ కోడ్, సెక్యూరిటీ కోడ్ వంటి అవసరమైన వివరాలతో పాటు 12-అంకెల ఆధార్ నంబర్ లేదా 16 అంకెల వర్చువల్ ఐడీ ని ఎంటర్ చేయాలి.

ఆ తరువాత సెలక్ట్ యూవర్ ప్రిఫరెన్స్ అనే సెక్షన్‌లో మాస్క్డ్ ఆధార్ సెలక్ట్ చేయాలి..

ఆ తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది.. దాన్ని ఎంటర్ చేస్తే మీ ఆధార్ కు మాస్క్డ్ ఫీచర్ ను పొందుతుంది.. దాన్ని మీరు పిడిఎఫ్ తీసుకుంటే మంచిది.. ఇప్పుడు మీ ఆధార్ కార్డు సేఫ్ లో ఉంటుంది..

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z