Business

ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన ‘ఆనంద్ మహీంద్రా’

ఓ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన ‘ఆనంద్ మహీంద్రా’

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ‘ఆనంద్ మహీంద్రా’ (Anand Mahindra) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన విషయాలను షేర్, ఫాలోవర్స్ ప్రశ్నలకు అప్పుడప్పుడూ స్పందిస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియో చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో గమనించినట్లయితే.. ఒక టీచర్, క్లాస్ రూమ్‌లో కొన్ని వస్తువులను చిందర వందరగా వేయడమే కాకుండా, చైర్స్‌ను కూడా ఎక్కడపడితే అక్కడ వేస్తుంది. ఆ తరువాత పిల్లలను అక్కడికి తీసుకు వస్తుంది. పిల్లలందరూ అక్కడున్న వస్తువులను యధాస్థానాల్లో చేర్చేస్తారు. ఈ వీడియో చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉంది.

ఈ వీడియా షేర్ చేస్తూ ఏం ఐడియా.. చిన్నప్పుడే పరిశుభ్రత, చక్కదనం వంటి వాటి గురించి అలవాటు చేస్తున్నారు, మనం కూడా మన ఫ్రీ, ఎలిమెంటరీ స్కూల్స్‌లో చేయగలమా.. అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది, వేల సంఖ్యలో లైక్స్ పొందిన ఈ వీడియో మీద కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z