DailyDose

22న ఏపీ ఓటర్ల తుది జాబితా

22న ఏపీ ఓటర్ల తుది జాబితా

ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘ఈ ఏడాది లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తాం. ఓటర్ల జాబితాలో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఓ పార్టీ కోరింది. ఎన్నికల నేపథ్యంలో తొలుత ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించాం. మంగళవారం విజయవాడలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాం. ఏపీ, తెలంగాణలో రెండు చోట్లా కొందరు ఓట్లు నమోదు చేసుకున్న అంశాన్ని ఓ పార్టీ ప్రస్తావించింది. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలని కొన్ని పార్టీలు కోరాయి.

రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో మహిళలు 2.07 కోట్లు, పురుషులు 1.99 కోట్ల మంది ఉన్నారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటం శుభ పరిణామం. ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశముంది. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 7.88 లక్షలు. వందేళ్లు దాటిన వృద్ధులు 1,174 మంది ఉన్నారు. ఈనెల 22న తుది జాబితా విడుదల చేస్తాం’’ అని తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z