Politics

మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు చేర్చాలనే విషయంపై కసరత్తు

మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు చేర్చాలనే విషయంపై కసరత్తు

ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్‌ (Congress) తీవ్రంగా యత్నిస్తోంది. పార్టీ మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు చేర్చాలనే విషయంపై కసరత్తు చేస్తోంది. దీని రూపకల్పనలో భాగస్వాములు కావాలంటూ ప్రజలకు పార్టీ పిలుపునిచ్చింది.

మేనిఫెస్టోను రూపొందించేందుకు ఏర్పాటుచేసిన కమిటీకి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం (P. Chidambaram) నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. కమిటీ సభ్యులు ప్రతి రాష్ట్రంలోని ప్రజలతో సంప్రదింపులు జరిపి సూచనలు సేకరిస్తారని ఆయన తెలిపారు. ఇది ప్రజల మేనిఫెస్టో అని అన్నారు. సూచనల కోసం ఈమెయిల్‌, ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించినట్లు చిదంబరం వెల్లడించారు. వీటి ద్వారా దేశవ్యాప్తంగా వీలైనంత ఎక్కువమంది నుంచి సూచనలు స్వీకరిస్తామన్నారు.

మేనిఫెస్టో కోసం awaazbharatki@inc.inకు సలహాలు ఇవ్వొచ్చు లేదా www.awaazbharatki.inలో నేరుగా అప్‌లోడ్‌ చేయవచ్చని పార్టీ తెలిపింది. దీనిపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా స్పందించారు. ‘‘కాంగ్రెస్‌ కేవలం పార్టీ కాదు. ప్రజల గొంతుక. టాప్‌- డౌన్‌ విధాన రూపకల్పనను విశ్వసించదు. సామాన్యుల ఆకాంక్షలకు అనుగుణంగా వారి అభివృద్ధికి ఉపయోగపడే విధానాలను తీసుకువస్తుంది. మేనిఫెస్టో ఎలా ఉండాలో సూచనల ద్వారా తెలియజేయండి’’ అని పోస్టు పెట్టారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z