NRI-NRT

యూఏఈలో సంక్రాంతి వేడుకలు

యూఏఈలో సంక్రాంతి వేడుకలు

గలగల ప్రవహించే గోదావరి తీర గ్రామాలు కావచ్చు.. ఇసుక దిబ్బల ఎడారి పెట్రో నగరాలు కావచ్చు.. ఎక్కడైనా పండుగ పండగే. సంక్రాంతి సంస్కృతి సంప్రదాయాల నెలవు మాతృభూమి గానీ పరాయి గడ్డ గానీ అందుకు మినహాయింపు కాదు. భోగి మంటలు, పసందైన పిండి వంటలు, కొత్త బట్టల వయ్యారాలు, గోదాదేవి, శ్రీరంగనాథుల కళ్యాణ మహోత్సవ ఆధ్యాత్మికతతో సంక్రాంతి యూఏఈలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. తెలుగు తరంగిణి అధ్వర్యంలో ప్రవాసీయులు పండుగను వైభవోపేతంగా జరుపుకున్నారు. రాస్ అల్ ఖైమాలోని ఇండియన్ అసోసియేషన్ ప్రాంగణం భక్తి పారవశ్యంతో నిండిపోయింది, తెలుగు తరంగిణి అధ్యక్షుడు వక్కలగడ్డ వెంకట సురేష్ అధ్వర్యంలో భారీ సంఖ్యలో ప్రవాసీయులు పాల్గొన్నారు.

భోగి మంటలతో నాంది పలికిన కార్యక్రమంలో గాలి పటాలు, ముగ్గుళ్ల రంగవల్లులు, చిన్నారుల హరిదాసుల ప్రదర్శనలు, సామూహిక తిరప్పావై, శ్రీ విష్ణు సహస్రనామ పఠనం, అధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి బ్రహ్మశ్రీ కాసిన ప్రసాద్ గణేశ్ ప్రత్యేకంగా విచ్చేశారు. ఆయన అధ్వర్యంలో శ్రీ గోదా రంగనాధ కల్యాణం, పల్లకి సేవలో భక్తులందరూ పరవశించిపోయారు. కళ్యాణంలో పాల్గొన్న వారందరికి టీటీడీ తరఫున లడ్డూలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ ప్రతినిధులు సైతం పాల్గొన్నారు.

తెలుగు సినీ నటుడు ప్రదీప్.. కుటుంబ సమేతమంగా పాల్గొన్నారు. సురేఖ పట్నం వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ సందర్భానుసారం సన్నివేశానికి అనుగుణంగా చేసిన కామెంట్లు అందర్నీ అలరించాయి. తెలుగు తరంగిణి బృందం తరఫున శ్రీనివాసరావు , రాజేశ్ చామర్తి, సత్యానంద, డాక్టర్ వీరా, కేదార్. డాక్టర్ రాఘవేంద్ర, ప్రసాద్, బ్రహ్మ, విజయ్, శరత్ చంద్ర, సైదా రెడ్డి. శివారెడ్డి,రామశేషు, రవి, అనిల్ కుమార్, వెంకట కళ్యాణ్, లక్ష్మణ్ రావు, శివానందరెడ్డి, ఫ్లోరెన్స్ విమల, వీరేంద్రలు తదితరులు పాల్గన్నారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z