Devotional

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

నంద్యాల జిల్లా శ్రీశైలంలో మార్చి 1 నుంచి 11 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై దేవస్థాన సిబ్బంది స్థానిక తహసీల్దార్, వైద్య, పోలీస్ అధికారులతో ఈవో పెద్దిరాజు సమావేశం నిర్వహించారు. 11 రోజుల పాటు జరగనున్న ఈ బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్ల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాదయాత్రగా వచ్చే భక్తులకు భీమునికొలను కైలాసద్వారంలో ఏర్పాట్లు చేయాలని సూచించారు.

వాహనాల పార్కింగ్ కు గత సంవత్సరం కంటే ఎక్కువగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. భక్తులకు తాత్కాలిక వసతి, త్రాగునీరు, విశ్రాంతి తీసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఈవో అధికారులకు సూచించారు. బ్రహ్మోత్సవాలలో ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆత్మకూరు డీస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z