Movies

జైలర్-2

జైలర్-2

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఏకంగా 700కోట్లకు పైగా వసూల్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. జైలర్ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోందని కోలీవుడ్ లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం రజినీకాంత్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వేటయన్ అనే సినిమా చేస్తున్నారు రజిని. అలాగే లోకేష్ కానగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇక వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే జైలర్ సినిమాకు సీక్వెల్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. జైలర్ సీక్వెల్ కు ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్, అనిరుధ్, నెల్సన్ దిలీప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారని కోలీవుడ్ లో వినిపిస్తున్న టాక్.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z