DailyDose

మణికొండలో మృతదేహం కలకలం-నేరవార్తలు

మణికొండలో మృతదేహం కలకలం-నేరవార్తలు

* రంగారెడ్డి జిల్లా మణికొండలో కారులో మృతదేహం లభ్యం కావడం కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలిని నార్సింగి పోలీసులు పరిశీలించారు. మారుతి వ్యాన్‌లో ఉన్న మృతదేహాన్ని మణికొండకు చెందిన ఆటోడ్రైవర్‌ రమేశ్‌దిగా గుర్తించారు. శనివారం స్నేహితులతో కలిసి ఆయన యాదగిరిగుట్టకు వెళ్లి వచ్చినట్లు సమాచారం. స్నేహితులతో గొడవ జరిగి రమేశ్‌ హత్యకు గురయ్యాడా? అనారోగ్యంతో మృతి చెందాడా? ఆత్మహత్యా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

* భారత్‌కు చెందిన 23 మంది జాలర్లను శ్రీలంక నేవీ అరెస్టు చేసి, వారి రెండు బోట్లను స్వాధీనం చేసుకుంది. తమిళనాడులోని రామేశ్వరం అధికారులు, స్థానిక మత్య్సకార సంఘం తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం సహాయరాజ్‌, జేమ్స్‌ అనే ఇద్దరు జాలర్లకు చెందిన పడవల్లో 23 మంది పాయింట్‌ పెడ్రోకు ఉత్తరాన ఉన్న జలాల్లో చేపల వేటకు వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో వారిని శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేసి, విచారణ నిమిత్తం జాఫ్నా సమీపంలోని మైలితి పోర్ట్‌కు తరలించినట్లు సమాచారం అందిందని తెలిపారు. కాగా.. భారత జాలర్లను శ్రీలంక నేవీ అరెస్టు చేయడం రెండు నెలల వ్యవధిలో ఇది మూడోసారి. జనవరిలో రెండు సార్లు 12 మందిని, మరోసారి పది మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకుని, వారి పడవలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్నేషనల్‌ మారిటైం బౌండరీ లైన్‌ను దాటి తమ జలాల్లో చేపల వేట చేశారన్న ఆరోపణలపై వారిని అరెస్టు చేశారు. అనంతరం వారిలో పది మందిని విడిచిపెట్టారు. తాజాగా 23 మందిని అరెస్టు చేయడంపై మత్య్సకార సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శ్రీలంక నేవీ అకారణంగా అరెస్టులు చేస్తోందని, కేంద్రం ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో రామనాథపురం జిల్లాలో లోక్‌సభ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు.

* ఏపీలోని పశ్చిమ గోదావరి (West Godavari ) జిల్లా కోడేరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలురు దుర్మరణం చెందారు. తూర్పుపాలెంలో జరిగిన ఆసరా కార్యక్రమంలో పాల్గొని తిరిగి గ్రామానికి వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా (Auto Overturn) పడింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ముత్యాలపల్లికి గ్రామానికి చెందిన వాసుదేవ(13), నాగరాజు(12) అనే ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు (Police Case) నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* తల్లి ఇంటికి కూతురు కన్నం వేసింది. చెల్లి పెళ్లి కోసం ఉంచిన నగలు, నగదును చోరీ చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఇంటి దొంగను పట్టుకున్నారు. పెద్ద కుమార్తె బురఖా ధరించి ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. జనవరి 30న ఉత్తమ్ నగర్ ప్రాంతానికి చెందిన కమలేష్‌ అనే మహిళ స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. ఆ రోజు మధ్యాహ్నం తాను ఇంట్లో లేనప్పుడు బీరువాలో దాచిన లక్షల విలువైన నగలు, రూ.25,000 చోరీ అయ్యాయని ఫిర్యాదు చేసింది. కాగా, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ఇంటిని పరిశీలించారు. మెయిన్‌ డోర్‌, బీరువా చెక్కుచెదరకుండా ఉండటంతో ఆ ఇంట్లోకి బలవంతంగా ఎవరూ ప్రవేశించలేదని గ్రహించారు. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. బురఖా ధరించిన మహిళ ఆ ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుసుకున్నారు. కమలేష్‌ పెద్ద కుమార్తె అయిన 31 ఏళ్ల శ్వేతగా గుర్తించారు. ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మరోవైపు కొంతకాలంగా తల్లి ఇంట్లోనే ఉన్న శ్వేత అప్పులపాలైంది. వాటి నుంచి బయటపడేందుకు చెల్లి పెళ్లి కోసం ఉంచిన నగలను చోరీ చేయాలని భావించింది. దీని కోసం ప్లాన్‌ వేసింది. జనవరిలో తల్లి ఇంటి నుంచి బయటకు వచ్చి వేరే ఇంట్లో ఉంటున్నది. దీంతో తన పనుల తర్వాత తల్లి ఆమె వద్దకు వచ్చేది.

* పొగాకు ఇవ్వనందుకు ఆగ్రహించిన ఒక వ్యక్తి వదిన, ఆమె కుమారుడిపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటనలో ఐదేళ్ల బాలుడు మరణించాడు. (Man Kills Nephew With Axe) ఆ మహిళ తీవ్రంగా గాయపడింది. మధ్యప్రదేశ్‌లోని షాహదోల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బియోహరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్కాచ్ గ్రామానికి చెందిన 30 ఏళ్ల రామ్లా కోల్ శనివారం రాత్రి పెద్ద అన్న భార్య అయిన 35 ఏళ్ల వదిన సుఖి బాయిని పొగాకు అడిగాడు. పొగాకు ఇంట్లో లేదని ఆమె చెప్పింది. ఆగ్రహించిన అతడు రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లోకి వెళ్లాడు. నిద్రిస్తున్న వదిన, కుమారుడి వరుసైన ఐదేళ్ల బాలుడిపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z