Business

లూనా గుర్తుందా? ఇప్పుడు ఈ-మోపెడ్‌గా తిరిగి వస్తోంది.

లూనా గుర్తుందా? ఇప్పుడు ఈ-మోపెడ్‌గా తిరిగి వస్తోంది.

ఇ-లూనా తిరిగి వస్తోంది. కైనటిక్‌ గ్రీన్‌ కంపెనీ దీన్ని అధికారికంగా ఫిబ్రవరి 7న ఆవిష్కరించింది. దీని ధర రూ.69,990 నుంచి ప్రారంభమవుతుంది. కైనటిక్‌ ఇ-లూనా ఎక్స్‌1, ఎక్స్‌2 పేరుతో రెండు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ఎక్స్‌1 వేరియంట్‌ ధర రూ.69,990 (ఎక్స్‌ షోరూమ్‌, దిల్లీ) కాగా.. ఎక్స్‌2 వేరియంట్‌ ధరను రూ.74,990గా కంపెనీ నిర్ణయించింది. ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ, నలుపు రంగుల్లో లభిస్తుంది. ఎక్స్‌2 వేరియంట్లో 2క్వ్హ్ బ్యాటరీ ఇచ్చారు. సింగిల్‌ ఛార్జ్‌పై 110కి.మీ. ప్రయాణించొచ్చు. ఎక్స్‌1 వేరియంట్‌లో 1.7క్వ్హ్ బ్యాటరీ ఇచ్చారు. దీంతో సింగిల్‌ ఛార్జ్‌పై 80 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. దీని టాప్‌ స్పీడ్ 50 కిలోమీటర్లు. ఛార్జింగ్‌ టైమ్‌ నాలుగు గంటలు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z