DailyDose

శోభనం రాత్రి వరుడి అత్యుత్సాహం..వధువు మృతి-CrimeNews-Feb 13 2024

శోభనం రాత్రి వరుడి అత్యుత్సాహం..వధువు మృతి-CrimeNews-Feb 13 2024

* మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్‌ సత్యనారాయణ ఏసీబీ వలకు చిక్కారు. రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. గచ్చిబౌలిలో ఉంటున్న ఓ వ్యక్తికి చెందిన భూమి శామీర్‌పేటలో ఉంది. దానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేసేందుకు తహసీల్దార్‌ రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో.. సత్యనారాయణ డ్రైవర్‌ బద్రి డబ్బు తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన తీసుకోమంటేనే డబ్బు తీసుకున్నట్లు డ్రైవర్‌ అంగీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

* అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తుండగా వన్యప్రాణుల వేట కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు ఉచ్చు తగిలి గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ ఆడె ప్రవీణ్‌(34) మృతిచెందారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం శివారు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం దాదాపు 13 మందితో కూడిన గ్రేహౌండ్స్‌ బృందం కాటారం శివారు అటవీలో ఆదివారం రాత్రి కూంబింగ్‌ చేపట్టింది. రాత్రి 10:15 సమయంలో కాటారం-మహదేవపూర్‌ ప్రధాన రహదారికి 600మీటర్ల దూరంలో గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన విద్యుత్తు తీగలకు తగిలి గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ ప్రవీణ్‌ అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. ఆయన చేయి, కాలు, పొట్టభాగంలో తీవ్ర గాయాలయ్యాయి. కాటారం సీఐ రంజిత్‌రావు, ఎస్సైలు, సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని అంబులెన్స్‌లో భూపాలపల్లికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందారు. ప్రవీణ్‌ది ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం రాజోలుగూడ. మృతుడికి భార్య లత, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటన స్థలాన్ని భూపాలపల్లి ఓఎస్డీ అశోక్‌కుమార్‌, కాటారం సీఐ నాగార్జునరావు, ఎస్సై అభినవ్‌ పరిశీలించి వివరాలు సేకరించారు. వేటగాళ్లు అమర్చిన తీగను స్వాధీనం చేసుకున్నారు. ఈకేసులో ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ప్రవీణ్‌ కుటుంబాన్ని ఆదుకుంటామని అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వేటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

* చేపల వేటకు సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు మంటల్లో చిక్కుకుంది. బోటుకు అమర్చిన డీజిల్‌ ఇంజిన్‌ వేడెక్కి మంటలు చెలరేగడం, ఆ వెంటనే పేలడంతో అగ్నికీలలు బోటును చుట్టుముట్టాయి. అనూహ్య పరిణామానికి భీతిల్లిన మత్స్యకారులు సాయం కోసం కేకలు వేస్తూ సముద్రంలోకి దూకేశారు. సమీపంలోనే మరో బోటు ఉండటంతో దానిపైకి చేరుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. మత్స్యకారులంతా క్షేమంగా ఉన్నట్లు సమాచారం రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కాకినాడ జిల్లా కొత్తపల్లి మండల పరిధిలోని సముద్ర తీరంలో సోమవారం సాయంత్రం 4 గంటలకు చోటుచేసుకుంది. ఉప్పాడ గ్రామానికి చెందిన 11 మంది మత్స్యకారులు సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు బోటులో వేటకు వెళ్లారు. తీరం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలోని రిలయన్స్‌కు చెందిన సిగ్నల్‌ స్తంభాల సమీపంలో చేపలు పడుతుండగా ఒక్కసారిగా ఇంజిన్‌ పేలిపోయి మంటలు వ్యాపించాయి. బోటు పూర్తిగా దగ్ధమైందని, వలలు పూర్తిగా కాలిపోయాయని మత్స్యకారులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ప్రమాదంలో రూ.25 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. బాధితులు మంగళవారం ఉదయానికి ఒడ్డుకు చేరుకునే అవకాశం ఉందని స్థానిక మత్స్యకారులు చెప్పారు.

* కొత్త‌గా పెళ్లైంది. ఇక తొలిరాత్రిలోనే త‌నివితీరా అనుభూతి పొందాల‌నుకున్నాడు. అందుకు శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే పిల్స్ వినియోగించాడు. ఆ త‌ర్వాత భార్య‌తో శృంగారంలో పాల్గొన్నాడు. అయితే ఆ చ‌ర్య‌లో భార్య తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైంది. మూడు రోజుల పాటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ నూత‌న వ‌ధువు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హ‌మీర్‌పూర్‌లో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. హ‌మీర్‌పూర్ ప‌రిధిలోని ఉరైకు చెందిన ఓ ఇంజినీర్ ఈ నెల 3వ తేదీన వివాహం చేసుకున్నాడు. ఇక 4వ తేదీన పుట్టింటి నుంచి అత్తారింటికి నూత‌న వ‌ధువు వెళ్లింది. ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన వ‌రుడి ఇంట్లో నూత‌న దంప‌తుల‌కు శోభ‌నం ఏర్పాటు చేశారు. అయితే తొలిరాత్రిలోనే ఎక్కువ అనుభూతి పొందాల‌నుకున్న వ‌రుడు.. శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచే పిల్స్ తీసుకున్నాడు. అనంత‌రం భార్య‌తో శృంగారం చేశాడు. అయితే వ‌ధువుకు తీవ్ర ర‌క్త‌స్రావం జ‌రిగింది. అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో ఆమెను కాన్పూర్ జిల్లాలోని ఓ ప్ర‌యివేటు న‌ర్సింగ్‌హోంకు త‌ర‌లించారు. అక్క‌డ ఆమె చికిత్స పొందుతూ ఫిబ్ర‌వ‌రి 10వ తేదీన ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘ‌ట‌న‌పై మృతురాలి కుటుంబ స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మృతురాలి కుటుంబ స‌భ్యులు డిమాండ్ చేశారు.

* డ్ర‌గ్స్ కేసులో కీల‌క నిందితుడు ఉడోకో స్టాన్లీని పోలీసులు అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. స్టాన్లీ కేసు ద‌ర్యాప్తులో మ‌రో కీల‌క నిందితుడు ఓక్రా వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డింది. డ్ర‌గ్స్ కేసులో అరెస్టైన ఓక్రా.. గ‌త మూడేండ్ల నుంచి గోవా జైల్లో ఉంటున్నాడు. అయితే హైద‌రాబాద్‌లో స్టాన్లీ కోసం ఎవ‌రెవ‌రు ప‌ని చేశార‌న్న వారి వివ‌రాల కోసం పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. డ్ర‌గ్స్‌పై ఉక్కుపాదం మోపుతామ‌ని హైద‌రాబాద్ పోలీసులు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. స్టాన్లీ కాంటాక్ట్ లిస్ట్‌లో ప‌లువురి ప్ర‌ముఖుల పేర్లు ఉన్నాయి. డ్రగ్స్‌ పెడ్లర్‌ స్టాన్లీ అంతర్జాతీయంగా మత్తు సామ్రాజ్యాన్నే స్థాపించాడు. మంగళవారం టీఎస్‌ న్యాబ్‌, హెచ్‌న్యూ, పంజాగుట్ట పోలీసులు స్టాన్లీని అరెస్టు చేసి.. రూ.8 కోట్ల విలువజేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అతడి వ్యక్తిగత జీవితంతో పాటు నేర సామ్రాజ్య విస్తరణపై పోలీసుల దర్యాప్తులో అనేక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నైజీరియాకు చెందిన 43 ఏండ్ల ఇవులా ఉకోడా స్టాన్లీ 2009లో భారత్‌లో అడుగు పెట్టాడు. ముంబైలో జూవెల్‌ అనే వ్యక్తి సాయంతో రెడీమేడ్‌ బట్టల వ్యాపారాన్ని ప్రారంభించి, అక్కడి నుంచి గోవాలోని కండోలిమ్‌కు చేరుకున్నాడు. తోటి నైజీరియన్లను పరిచయం చేసుకొని డ్రగ్స్‌ దందాను నేర్చుకున్నాడు. తొలుత గోవాకు వచ్చే పర్యాటకులు, సందర్శకులకు డ్రగ్స్‌ను విక్రయించడం ప్రారంభించాడు. గత 15 ఏండ్ల కాలంలో మత్తు పదార్థాల విక్రయం, సరఫరా చేస్తూ దేశ, విదేశాలకు తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z