Devotional

అభివృద్ధి ఉంటుంది – Horoscope – Mar 21 2024

అభివృద్ధి ఉంటుంది – Horoscope – Mar 21 2024

మేషం
ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. కుటుంబంలో అనుకోకుండా లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి.

వృషభం
వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనం ఏర్పడుతుంది.

మిథునం
ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నం చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు ఉంటాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది.

కర్కాటకం
శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

సింహం
స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తవహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు.

కన్య
కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.

తుల
ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది.

వృశ్చికం
ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చుచేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.

ధనుస్సు
ప్రతివిషయంలో అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.

మకరం
ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. చంచలం అధికమవుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు. స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయాణాలు ఉంటాయి.

కుంభం
అకాల భోజనాదులవల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిదికాదు. చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించరాదు.

మీనం
ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రయత్నకార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. కుటుంబమంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z