NRI-NRT

లండన్‌లో వేంకటేశ్వర ఆలయాన్ని నిర్మించిన ప్రవాసాంధ్రులు

లండన్‌లో వేంకటేశ్వర ఆలయాన్ని నిర్మించిన ప్రవాసాంధ్రులు

లండన్‌లో శ్రీ వేంకటేశ్వర బాలాజీ దేవాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ వెంకటేశ్వర (బాలాజీ) టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్ (SVBTCC) 2019లో ఏర్పడిన స్వచ్ఛంద సంస్థ. లండన్‌లోని బ్రాక్‌నెల్‌లోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. పురాతన హిందూ గ్రంధాలు, శిల్ప స్థాపత్య శాస్త్రాలను అనుసరించి శుభ కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీనివాస శర్మ, ప్రధానార్చకులు, ఇతర అర్చకుల సారధ్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవారి ప్రాణప్రతిష్ఠాపన జరిగింది

లండన్‌లో అతి పెద్ద వెంకటేశ్వర స్వామి బాలాజీ ఆలయాన్ని స్థాపించాలన్న విస్తృత ఆశయానికి ఇది మైలురాయిగా నిలిచిందన్నారు. SVBTCC ట్రస్టీలు డా.రాములు దాసోజు, కృష్ణ కిషోర్, సురేష్ రెడ్డి, కమలా కోట చర్ల, ప్రవీణ్ మస్తీ, సురేష్ గోపతి, భాస్కర్ నీల మరియు పావని రెడ్డి సహా ఎగ్జిక్యూటివ్ టీమ్ సభ్యులు తుకారాం రెడ్డి, రవి వాసా, రవి శ్రీరంగం, వంశీ వి, వంశీ బి, విశ్వేశ్వర్ గోవర్ధన్, రాఘవేంద్ర, గౌతం శాస్త్రి మరియు గోపి కొల్లూరు, వాలంటీర్లు హాజరయ్యారు. లండన్‌లోని ఈ ఆలయం వారంలో అన్ని రోజులు ఉదయం, సాయంత్రం భక్తుల సౌకర్యార్థం తెరిచి ఉంటుంది

More info: https://svbtcc.org/




👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z