Health

జామకాయ తింటే.. ప్రయోజనం ఉంటుందా..

జామకాయ తింటే.. ప్రయోజనం ఉంటుందా..

జామకాయ సంవత్సరం పొడవునా చాలా చవకగా దొరుకుతుంది. జామ పండును చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. చాలా తక్కువ ఖర్చులో ఎక్కువ పోషకాలను మన శరీరానికి అందించే పండ్లలో జామకాయ ఒకటి. జామకాయలో విటమిన్ సి చాలా సమృద్దిగా ఉంటుంది.రోజు ఒక జామకాయ తింటే శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది. జామకాయ తినే విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. జామకాయ తింటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయని చాలా మంది తినరు. విత్తనాలు వున్న పండ్లను తింటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయని చాలామంది అనుకుంటుంటారు. కానీ టొమాటో, జామ, బెండకాయ మొదలైన విత్తనాలను కలిగి ఉన్న ఆహారాన్ని మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న రోగులు తినకుండా నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేదు.ఎందుకంటే విత్తనాలు రాళ్లు ఏర్పడే సామర్థ్యాన్ని పెంచవు. జామపండులో విటమిన్ ఎ మరియు లూటీన్ మరియు లైకోపీన్ వంటి ఇతర ఫైటోన్యూట్రియెంట్‌లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్న సమ్మేళనాలు, ఇవి ఆక్సీకరణ ఒత్తిడికి వ్యతిరేకంగా మూత్రపిండాల కణాలకు సహాయపడతాయి. పొటాషియం తక్కువ ఉన్న జామకాయను తినవచ్చు.జామలో కరగని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థలో ఆహారాన్ని బాగా జీర్ణం చేయటంలో సహాయపడటమే కాకుండా చిన్న ప్రేగులలోని మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. జీర్ణ వ్యవస్థలో సమస్యలు లేకుండా చేస్తుంది. అయితే మోతాదు మించకుండా తినాలి. ఒకసారి డాక్టర్ ని సంప్రదించి తినటం చాలా ఉత్తమం.