Videos

తెలంగాణలో 40 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు

తెలంగాణలో 40 కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు

హైదరాబాద్ , సికింద్రాబాద్ జంట నగరాల్లో కొత్తగా 40 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది. వీటికి అదనంగా కొత్తగా రెండు టాస్క్‌ఫోర్స్ జోన్లు ఏర్పడనున్నాయి.

హైదరాబాద్ , సికింద్రాబాద్ జంట నగరాల్లో కొత్తగా 40 పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది. అంతేకాకుండా హైదరాబాద్‌లో 12 ఏసీపీ డివిజన్లు, సైబరాబాద్‌లో 3 డీసీపీ జోన్లు ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా ఆరుగురు డీసీపీలను నియమించనున్నారు. ప్రతి జోన్‌కు మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు జీవోలో ప్రస్తావించారు. అలాగే 11 లా అండ్ ఆర్డర్, 13 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు, ప్రతి చోటా సైబర్ క్రైమ్, నార్కోటిక్ వింగ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

మరోవైపు వీటికి అదనంగా కొత్తగా రెండు టాస్క్‌ఫోర్స్ జోన్లు ఏర్పడనున్నాయి. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో మేడ్చల్, రాజేంద్రనగర్.. రాచకొండ కమీషనరేట్ పరిధిలో మహేశ్వరం జోన్… హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో దోమలగూడ, సెక్రటేరియట్, వారాసిగూడ, బండ్ల గూడ, ఐఎస్ సదన్, గుడిమల్కాపూర్, మాసబ్ ట్యాంక్, ఫిలింనగర్, మధురానగర్, బోరబండ.. సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో జినోమ్ వ్యాలీ, కొల్లూరు, సూరారం, అల్లాపూర్, మోకిల్లాలలో కొత్తగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.