Politics

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం?

మహారాష్ట్రలో  రాజకీయ సంక్షోభం?

మహారాష్ట్ర  లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొనేలా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే  నేతృత్వంలోని శివసేన కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు , 9 మంది ఎంపీలు  భారతీయ జనతా పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారని శివసేన (యూబీటీ) పార్టీ  అధికారిక పత్రిక ‘సామ్నా’  పేర్కొంది. వారంతా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారని తెలిపింది.BJP తీరుపై నిరసనగా బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. వారి నియోజకవర్గాల్లో అభివృద్ధి జరగడం లేదని వారు ఆరోపిస్తున్నారని తెలిపింది. కాగా, ఇదే నిజమైతే మరోసారి మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.