Fashion

గోళ్ల నిగారింపుకి ఆలివ్ ఆయిల్

Olive oil promotes nail health

* నీళ్లల్లో రెండు చుక్కల లిక్విడ్‌బాత్‌సోప్‌ వేసి గోళ్లను నాననివ్వండి. ఆ తరువాత కొద్దిగా ఆలివ్‌ నూనెతో మర్దన చేయండి. ఆలివ్‌ నూనెలో లినోలిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది గోళ్లను తేమగా ఉంచుతుంది. మెరిసేలా చేస్తుంది. రెండు చెంచాల ఆలివ్‌ నూనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి గోళ్లపై రాయండి. దీనివల్లా అవి తాజాగా మారతాయి.
* ఒక వెడల్పాటి గిన్నెలో గోరువెచ్చని పాలు తీసుకుని అందులో కొన్ని నిమిషాలు గోళ్లను ఉంచండి. తర్వాత నీళ్లతో శుభ్రం చేసి మాయిశ్చరైజర్‌ రాస్తే సరిపోతుంది. దీనివల్ల గోళ్లు శుభ్రపడడమే కాక తాజాగానూ ఉంటాయి.
* కొబ్బరినూనెలో పోషకాలు ఎక్కువ. ఉండి గోళ్లను బలంగా మారేలా చేస్తాయి. చెంచా చొప్పున కొబ్బరి, ఆలివ్‌ నూనె, నిమ్మరసం కలిపి గోరువెచ్చగా చేసుకోవాలి. కప్పు గోరువెచ్చటి నీటిలో ఈ మిశ్రమాన్ని వేసి అందులో ఇరవై నిమిషాల పాటు గోళ్లను ఉంచాలి. ఇప్పుడు గోళ్లను శుభ్రం చేసి పెట్రోలియం జెల్లీ రాస్తే సరిపోతుంది.