Agriculture

మద్దతు ధర ఇచ్చేందుకు మంచి విధానాలు రూపొందించండి

Think Of Good Minimal Price Policies - CM Jagan Asks Agri Officials

వ్యవసాయ మిషన్‌పై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్ష

అగ్రి మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌పై సీఎం ఆరా
పంటలు, వాటికి లభిస్తున్న ధరలపై ఎప్పటికప్పుడు సమాచారం ఎలా వస్తుందని అధికారులను ప్రశ్నించిన సీఎం
మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌పై సమర్థవంతమైన యంత్రాంగం ఉండాలి
ఇప్పుడున్న వ్యవస్థ ఎలా నడుస్తుందో పరిశీలించండి
ప్రత్యామ్నాయ విధానం కూడా ఉండాలని స్పష్టంచేసిన సీఎం
అగ్రికల్చర్‌ కమిటీలనుంచి వచ్చే సమాచారాన్ని బేరీజు వేసుకోవడానికి మరో యంత్రాంగం అవసరమన్న సీఎం
పంటల ధరలను స్థిరీకరించడానికి దీర్ఘకాలిక ప్రణాళికతో వెళ్లాల్సిన అవసరం ఉందన్న సీఎం వైయస్‌.జగన్‌
వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్‌పై ఒక సెల్‌ను ఏర్పాటుచేయాలన్న సీఎం, అత్యుత్తమ నిపుణులను ఇందులో నియమించాలన్న సీఎం
దీనిపై కసరత్తు చేయాలని సీఎం ఆదేశం

వ్యవసాయ మిషన్‌ తదుపరి సమావేశంలో రాబోయే పంటల దిగుబడులు, వాటి లభించే మద్దతు ధరల అంచనాలు, మార్కెట్‌లో పరిస్థితులను నివేదించాలన్న సీఎం

మినుములు, పెసలు, శెనగలు, టమోటాలకు సరైన ధరలు రావడంలేదని చెప్పిన అధికారులు
ప్రభుత్వం వద్ద, రైతుల వద్ద నిల్వలు ఉన్నాయని, దీంతోపాటు దిగుమతి విధానాలు సరళతరం చేయడం కూడా ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలున్న అధికారులు
వచ్చే రబీ సీజన్‌లో పప్పుదినుసలకు తక్కువగా ధరలు నమోదయ్యే అవకాశాలున్నాయని చెప్పిన అధికారులు
టమోటా ధరల్లో హెచ్చుతగ్గులున్నాయన్న అధికాకులు
ఉల్లి ధరలు వినియోగదారుల మార్కెట్లో కాస్త పెరుగుతున్నాయన్న అధికారులు
ఈ పంటలకు సంబంధించి కొనుగోళ్లకోసం ప్రణాళిక వేశారా? లేదా? అని అడిగిన సీఎం
తగినన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలుపెట్టారా? లేదా? అని అధికారులను వివరాలు అడిగిన సీఎం
మద్దతు ధరలు దొరక్క, కొనుగోలు కేంద్రాలద్వారా కొనుగోలు చేయక గత ప్రభుత్వం హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న సీఎం
గతంలో వ్యాపారులు, రాజకీయ నాయకులు రైతుల ముసుగులో అక్రమాలకు పాల్పడ్డారని సమావేశంలో ప్రస్తావన
కొన్ని జిల్లాల్లో ఈ ఘటనలు అధికంగా జరిగాయన్న అధికారులు
ఇంతకు ముందు రైతులకు కనీస మద్దతు ధర కల్పించడానికి నిధుల సహకారం లేదు
పంటలకు ధర పడిపోయిన తర్వాత… ఆ నిధులు తెచ్చుకునే సరికి పుణ్యకాలం కాస్త గడచిపోయేదన్న అధికారులు
పంట చేతికి వచ్చే సమయానికే కొనుగోలు కేంద్రాలు సిద్దంకావాలని సీఎం ఆదేశం
అక్టోబరు 15 నాటికే మినుములు, పెసలు,శెనగల తదితర పంటల కొనుగోలుకోసం కేంద్రాలు తెరవాలని సీఎం ఆదేశం
రైతులకు కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర ఇవ్వడానికి మంచి విధానాలపై ఆలోచనలు చేయాలన్న సీఎం
కొనుగోలు కేంద్రాలవద్ద వారికి ఇబ్బందులు రాకుండా చూడాలన్న సీఎం
గ్రామ సచివాలయాల ద్వారా పలానా పంటలు వేశామంటూ రైతులు సులభంగా రిజిస్ట్రేషన్‌ చేయింకునేలా చూస్తామన్న అధికారులు
గ్రామవాలంటీర్ల సహాయంతో ప్రతిరైతూ రిజిస్ట్రేషన్‌ చేయించుకునేలా చేస్తామని, దీనిద్వారా సరైన మద్దతు లభించేలా ప్రభుత్వ తీసుకునే చర్యలద్వారా లబ్ధి రైతుకు లభిస్తుందని అధికారుల వెల్లడి
ఈ డేటా ఆధారంగా ఆపంటకు కచ్చితంగా మద్దతు ధర ఇచ్చేలా చూస్తున్నామన్న అధికారులు
రబీ పంటనుంచి ఈ పద్ధతిని అనుసరించడానికి ప్రయత్నాలుచేస్తామని వెల్లడి
పంట చేతికి వచ్చినప్పుడే కొనుగోలు చేస్తే.. రైతులకు లబ్ధి చేకూరుతుందన్న అధికారులు

ధరలస్థిరీకరణ నిధిని సద్వినియోగం చేసుకోవడంతోపాటు, కొనుగోలు కేంద్రాలద్వారా తీసుకున్న వ్యవసాయ ఉత్పత్తులకు మంచి మార్కెట్‌ కల్పించే పద్ధతులుద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూర్చేలా చూడాలన్న సీఎం

రాష్ట్రంలో వర్షపాతం వివరాలు, వివిధ జిల్లాలో పంటలసాగు వివరాలను అడిగితెలుసుకున్న సీఎం
కరువు కారణంగా ఆయా జిల్లాల్లో పరిస్థితులను సీఎంకు నివేదించిన అధికారులు
వివిధ వరద జలాలను సమర్థవంతంగా వినియోగించుకునే ప్రణాళికలు ఆలోచించాలన్న సీఎం
గత ప్రభుత్వం ఎగ్గొట్టిన రూ. 1830 కోట్ల రూపాయలను ఈ నెలాఖరులో రైతులకు ఇస్తున్నామన్న అధికారులు
వచ్చే నెల రైతు భరోసా, ఈ ఇన్‌పుట్‌సబ్సిడీలు రైతులకు అండగా ఉంటాయన్న సీఎం
కరవుకారణంగా ఇబ్బంది పడుతున్న రైతులకు ఊరట లభిస్తుందన్న సీఎం
తృణధాన్యాల సాగుమీద దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం
వర్షపాతం లోటు ఉన్న అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లో తృణధాన్యాల సాగును ప్రోత్సహించాలన్న సీఎం
తృణధాన్యాల సాగును ప్రోత్సహించడమే కాకుండా.. ప్రాససింగ్‌ యూనిట్ల ఏర్పాటుకూడా కీలకమన్న సీఎం, ఆమేరకు అధికారులు చర్యలు తీసుకోవాలన్న సీఎం
తృణధాన్యాలకు సరైన మద్దతు ధర ఇచ్చేలా చూడాలని సీఎంకు ఆదేశం

టమోటా ధరలు తగ్గడంపై సమావేశంలో చర్చ:
తక్షణ చర్యలకు సీఎం ఆదేశాలు:

టమోటా ధరలు బాగా తగ్గడంపై వ్యవసాయ మిషన్‌ సమావేశంలో ప్రస్తావ
ధరలు తగ్గడానికి అధికారులనుంచి వివరాలు కోరిన సీఎం
కర్ణాటక, మహారాష్ట్రలో టమోటా దిగుమతులు అధికంగా ఉన్నాయన్న అధికారులు
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో భారీవర్షాలు, వరదలు కూడా రవాణాకు అడ్డంకులు వస్తున్నాయన్న అధికారులు
టమోటా ధరలు పడిపోకుడా చూడాలంటూ సీఎం ఆదేశాలు
ఏం చేయాలన్న దానిపై అధికారులనుంచి సలహాలు కోరిన సీఎం
చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్‌ తదితర మార్కెట్లకు పంపించడం ద్వారా కొంత మేర ధరల నిలబెట్టవచ్చని అధికారులు సూచన
తక్షణమే చర్యలు తీసుకోవాలన్న సీఎం, ఎలాంటి ఆలస్యం చేయరాదని అధికారులకు ఆదేశం
అవసరమైతే రవాణాఖర్చులను సబ్సిడీగా భరించాలంటూ ఆదేశాలు
వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోతున్నప్పుడు డైనమిక్‌గా వ్యవహరించాలంటూ అధికారులకు ఆదేశాలు

పశువులకోసం వినియోగిస్తున్న ఔషధాల్లో ప్రమాణాలు, నాణ్యత ఉండడంలేదని సమావేశంలో ప్రస్తావన
ప్రపంచస్థాయి ప్రమాణాలు, నాణ్యత ఉండేలా చూడాలని సీఎం ఆదేశం

ఎండిపోతున్న మామిడి, చీనీ తదితర పంటలను కాపాడేందుకు నీటిసరఫరాకోసం పెండింగ్‌లో ఉన్న నిధులనువెంటనే విడుదలచేయాలని సీఎం ఆదేశం

సాయినాథ్‌
వాతావరణ మార్పులు రాష్ట్రంలో వ్యవసాయరంగంపై చూపిస్తున్న ప్రభావాన్ని అంచనా వేయాలి
సగటు వర్షపాతం ఉన్నా… కరువు ఎందుకు వస్తుందన్న పరిస్థితులపై అధ్యయనం చేయాలి
రెండు రోజుల్లో భారీగా వర్షం, ఆతర్వాత రెండు మూడునెలలపాటు చినుకుకూడా పడని ఘటనలు ఉన్నాయి
వీటివల్ల వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ప్రభావాన్ని సమగ్రంగా అధ్యయనం చేయాలి
గడచిన 5–10 సంవత్సరాల్లో తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన పద్దతులుపైకూడా సమీక్ష అవసరం
గడచిన 5–10 సంవత్సరాల్లో వివిధ రంగాల పనితీరుపై శ్వేతపత్రాలు తయారుచేయాలి
అలాగే వ్యవసాయరంగంలో పరిస్థితులపై ఒక శ్వేతపత్రాలు తయారుచేయాలి
దీని తర్వాత ప్రభుత్వం పద్దతులను, విధానాలను అనుసరించాలి
తృణధాన్యాలసాగును ప్రోత్సహించాలి