Politics

భాజపా వలలో ముగ్గురు వైకాపా ఎంపీలు

Three YSRCP MPs In BJP Hands-Telugu Political Scenario Today

ఏపీలో తెదేపా ఎమ్మెల్యేలకు బైకాపా భాజపా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంటే. డిల్లి రాజకీయం మరో విధంగా నడుస్తోంది. ఏపీ అధికార పార్టీ వైకాపా తాజాగా జరిగిన ఎన్నికల్లో ఇరవై మంది లోక్ సభ సభ్యులు గెలిచారు. లోక్ సభలో అతిపెద్ద నాలుగో పార్టీగా వైకాపా నిలిచింది. వైకాపా ఫ్లోర్ లీడర్ మిదున్ రెడ్డి ప్రధాన పార్టీల నేతల పక్కనే సీటు కేటాయించారు. ఇది వైసేపీకి దక్కిన అరుదైన అవకాశం. అయితే ఏపీలో ఎలాగైనా బలపడాలని ఆలోచనలతో ఉన్న భాజపా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఏపీలో వైకాపా అధికారంలో ఉండటంతో అక్కడి వేఇకాపా ఎమ్మెల్యేలను మాత్రం టచ్ చేయటం లేదు.
*కానీ రాజకీయంగా బిజీగా ఉండే వైకాపాలో ముగ్గురు ఎంపీలు మాత్రం భాజాపలోకి ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నట్లు డిల్లీలో జోరుగా ప్రచారం సాగుతోంది. అందులో భాగంగానే ఎంపీలు తప్పనిసరిగా కేంద్రం మంత్రుల వద్దకు వెళ్ళే సమయంలో విజయసాయి లేదా మిదున్ రెడ్డితో కలిసి వెళ్లాలని ముఖ్యమంత్రి జగన్ సూచించినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారం పార్లమెంటు సమావేశాల ప్రారంభ సమయంలో హాట్ టాపిక్ అయింది.
*ముగ్గురు వైకాపా ఎంపీలకు భాజపా ట్రాప్
ఏపీలో వైకాపా నుండి ముగ్గురు ఎంపీల్లో ముగ్గురు భాజపా నేతలతో సఖ్యతగా ఉంటున్నట్టు ప్రచారం సాగుతోంది. వ్యాపారాల్లో స్థిరపడి కాలంగా రాజకీయాలు సాగిస్తున్న ఇద్దరు ఎంపీలు వ్యాపార పరంగా భారీగా నష్టపోయి ఇబ్బందుల్లో ఉన్న మరో ఎంపీ భాజపా నేతలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ముగ్గురి వ్యాపారాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ముడిపడి ఉన్నది. దీంతో వారితో సఖ్యతగా ఉంటూ వ్యాపార ప్రయోజనాలు రక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని లోక్ సభలో ఇప్పుడు భాజపా సొంతంగా కావాల్సిన దాని కంటే ఎక్కువ మెజార్టీతో కొనసాగుతోంది. ఇప్పుడు ఇతర పార్టీల ఎంపీల అవసరం భాజపాకి సైతం వారికీ కావాల్సిన విధంగా సహకారం అందిస్తోంది పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.
*జగన్ అలర్ట్.. కీలక సూచనలు
కేంద్రంతో ముఖ్యమంత్రి సఖ్యతగానే ఉంటునారు. కేండం నుండి ఈ అయిదు నెలల కాలంలో ఎపీకి ప్రత్యెకగా అందిన సాయం లేదు. ఇక ప్రత్యెక హోదా విషయంలో ప్రస్తుతం జగన్ సైతం మౌనం పాటిస్తున్నారు. కేంద్రం మీద నిరంతరం ఒత్తిడి చేస్తూనే ఉంటామంటూ వినతి పత్రాలు అభ్యర్ధనలు చేస్తున్నారు. కనీ గతంలో మాట్లాడినంత గట్టిగా డిమాండ్ చేయలేక పోతున్నారు. ఇక కేంద్రంలో భాజపా నాయకత్వం రాజకీయంగా వేసే ఎత్తుగడలకు అనుసరించే వ్యూహాల మీద పూర్తీ అవగాహనే ఉండటంతో జగన్ అలర్ట్ అయారు. తన పార్టీ ఎంపీలు ఇప్పుడు భాజాపాకి అవసరం లేకపోయినా వారిని తమ చెప్పు చేతల్లో పెట్టుకునే ప్రయత్నాలు భాజపా చేస్తోందని అనుమానిస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీంతో ఆయన నేరుగా ఎంపీలేకే ఎ రకంగా వ్యవహరించారో స్పష్తం చేసారు. ఎంపీలు విజయ సాయిరెడ్డి మిదున్ రెడ్డి మార్గదర్శకంలో మాత్రమే ప్రధానిని కేంద్ర మంత్రులను కలవాలని నిర్దేసించారు.