Food

సగ్గుబియ్యంలో పెరుగు కలిపి తింటే….

sabudana curd chutney

????????????☘?????????☘???????????????☘????????????
కావలసినవి:
సగ్గుబియ్యం: కప్పు, పెరుగు: 2 కప్పులు, ఆవాలు: అర టీస్పూను, ఎండుమిర్చి: రెండు, కరివేపాకు: రెండు రెబ్బలు, ఉప్పు: తగినంత, మినప్పప్పు: టీస్పూను, పచ్చిమిర్చి: రెండు, నూనె లేదా నెయ్యి: తగినంత, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను

తయారుచేసే విధానం:
* ఓ గిన్నెలో పెరుగు, ఉప్పు వేసి బాగా మృదువుగా కలపాలి.
* బాణలిలో నూనె లేదా నెయ్యి వేసి సగ్గుబియ్యం వేయించి తీసి పెరుగులో వేయాలి. ఇప్పుడు సగ్గుబియ్యం వేయించి తీసిన నెయ్యిలోనే మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేగాక, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించి తీసి పెరుగు మిశ్రమంలో కలపాలి. చివరగా కొత్తిమీర తురుము కూడా వేసి కలిపి ఓ అరగంట తరవాత వడ్డించండి. బిర్యానీ, ఫ్రైడ్‌రైస్‌, పలావుల్లోకి చాలా బాగుంటుంది.