NRI-NRT

రంగులమయంగా టాకో 2020 రంగోళి

TACO 2020 Rangoli In Ohio USA

సెంట్రల్ ఒహాయో తెలుగు సంఘం (టాకో) వారు జనవరి 11న రంగరంగ వైభవంగా “రంగోళి” వేడుకలు జరుపుకున్నారు. టాకో 2020 కమిటీ వారి ఆధ్వర్యంలో తొలుతగా జరుపుకున్న ఈ వేడుక విశాల ప్రాంగణమైన “సెయింట్ జాన్ లుతెర్న్ చర్చి “, డబ్లిన్ లో జరిగింది. “రంగోళి” వేడుక 2020 టాకో అధ్యక్షులు జగన్నాథ్ చలసాని ఆధ్వర్యంలో నీలిమ యలమంచలి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ వేడుకకు 2020 కమిటీ కాళీ ప్రసాద్ మావులేటి, సుధీర్ కనగాల, ఉష శాఖమూరు, శివ చావా, రాజ్ వంటిపల్లి, సంపత్ నాలం, విజయ్ కాకర్ల, అనిల్ బ్యాడిగెర, వేణు అబ్బూరి, రామ్ సానేపల్లి, వినోద్ యడ్లపల్లి, సత్య మర్రే, ప్రదీప్ గుంటక, శ్రీదిత్య అట్లూరి, ప్రవీణ్ కుమార్ అంకం, రాజేష్ చెరుకూరి, భాను పొట్లూరి, శ్రీవర్షిణి ముద్దులూరు, తేజశ్వని కంచరపల్లి, ప్రదీప్ చందనం, జయ మేడేది, విక్రమ్ రాచర్ల, కీర్తి కౌశిక్ తరణి, అన్వేష్ పెండ్యాల, ఊహ కాట్రగడ్డ, రమ ప్రత్తిపాటి, చిరంజీవి సమ్మెట, సహాయకులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో రంగవల్లికలు (చుక్కల ముగ్గులు, సృజనాత్మకత ముగ్గులు ), చిత్రలేఖనం, గాలిపటాలు, కోలాటం పోటీలు నిర్వహించారు . ప్రత్యేకంగా ముగ్గుల పోటీలో పిన్నలు, పెద్దలు, వృద్దులు కూడా హుషారుగా పాల్గొని చక్కటి రంగవల్లికలు వేసి రంగులతో అందంగా తీర్చిదిద్దారు. పోటీలో మహిళలు విశేషంగా పాల్గొన్నారు. చిత్రలేఖనం పోటీలకు 100 పైచిలుకు పిల్లలు, పెద్దలు పాల్గొని ఎంతో చక్కని రంగులతో , అంశాలతో తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. అలాగే గాలిపటం పోటీలకు కూడా పిల్లలు ఎంతో వినూత్నమైన గాలిపటాలను తాయారు చేసి ప్రదర్శించారు. ఉత్సాహంగా సాగిన మహిళల కోలాటం పోటీలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. శ్రావణి గండేపల్లి హరికథా కాలక్షేపం, తొక్కుడు బిళ్ళ ఆట ప్రేక్షకులను అలరింపచేశాయి.”ఏకం” స్వచ్ఛంద సంస్థ వారు అల్పాహారాలతో అందరి ఆకలి తీర్చారు. ఈ పోటీలలో విజేతలుగా నిలిచిన వారికీ టాకో ట్రస్టీలు శ్రీలత రేవూరు, జ్యోతి దండు, ఫణిభూషణ్ పొట్లూరి, కోటి బోడెపూడి, సుబ్బారెడ్డి కోవూరు, బహుమతి ప్రధానం చేశారు. వర్షాన్నీ చిరుచలిని అధిగమించి 300 మందికి పైగా కొలంబస్ తెలుగు ప్రజలు ఈ వేడుకకు హాజరు కావటం విశేషం.