Agriculture

లడ్డూలు జీవితాలు నిలబెడుతున్నాయి

Jharkhand Ladies Reach Financial Stability With Laddus-Agriculture News

పొట్టకూటి కోసం సారా కాసిన చేతులవి…ఇప్పుడు పోషకాల లడ్డూలుచేస్తున్నాయి. ఇప్ప పువ్వుతో చితికిన బతుకులవి..ఇప్పుడు వాటితోనే నవ్వులువిరుస్తున్న జీవితాలయ్యాయి… ఇది జార్ఖండ్‌లోని ఓ కుగ్రామం కథ. అదేంటో మీరూచదవండి…అది జార్ఖండ్‌లోని షోసై గ్రామం. ఇప్ప చెట్లు ఎక్కువక్కడ. అవేఅక్కడి ప్రజల బతుకుదెరువు కూడా. మహిళలు వాటి పువ్వులతో సారా తయారు చేసేవారు.కుటుంబాన్ని నెట్టుకురావడానికి రోడ్డు పక్కన దుకాణాలు పెట్టుకుని మద్యంవిక్రయించేవారు. తాగొచ్చి కొట్టే భర్తలు… దుకాణాల్లో తాగుబోతుల వెకిలిచేష్టలు… ఇలా ఎన్ని రకాలుగా చితికిపోతున్నా కుటుంబం కోసం వీటన్నింటినీభరించేవారు. వారి జీవితాల్లో కమ్ముకున్న చీకట్లను తొలగించాలని నిర్ణయించుకుందితోరంగ్‌ అనే స్వచ్ఛంద సంస్థ. మూడేళ్ల క్రితం ఆ గ్రామంలో లాటిఫోలియా ఎంటర్‌ప్రైజెస్‌నునెలకొల్పింది. ఇప్ప పూలతో సారా కాకుండా లడ్డూలు ఎలా తయారు చేయాలో వారికినేర్పించింది. జీవితాలు మారుతుండటంతో ఒక్కొక్కరుగా ఆ సంస్థలో చేరారు. ఇప్పుడుమొత్తం వెయ్యి మంది అతివలు పని చేస్తున్నారు. ఇప్ప పువ్వులను సేకరించడం, వాటిని శుభ్రపరిచిపోషకాలు నిండిన లడ్డూలు తయారు చేయడం వారి పని. క్రమంగా వారి బతుకుల్లో వెలుగులుపూశాయి. వారి గ్రామం పూర్తిగా మద్యపానానికి దూరమైంది. వలసలు తగ్గిపోయాయి.కుటుంబాలు నిలబడ్డాయి. ఒకప్పుడు పస్తులున్నవారే ఇప్పుడు తక్కువ ధరలో పోషకాహారాన్నితయారు చేస్తున్నారు. ఇప్ప లడ్డూలో ప్రొటీన్లు, విటమిన్లు, ఇనుము అధికంగాఉంటాయి. ఇది వారి ఆరోగ్య సమస్యలను దూరం చేస్తోంది. ఈ లడ్డూలకు జార్ఖండ్‌లోనేకాదు.. పొరుగు రాష్ట్రాల్లోనూ మంచి డిమాండ్‌ ఉంది. ఇప్పుడు వారి జీవితాల్లో ఇప్పపువ్వులు పూస్తున్నాయి. బోసిపోయిన ముఖాల్లో నవ్వులు విరుస్తున్నాయి. చితికినబతుకుల్లో ఆత్మగౌరవం వెల్లివిరుస్తోంది.