DailyDose

భారీగా పెరిగిన గ్యాస్ ధర-వాణిజ్యం

LPG Rates Hiked In India-Telugu Business News

* నాన్ సబ్సిడీ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) ధరలు ఈ రోజు (12 ఫిబ్రవరి) నుండి పెరిగాయి. ఈ మేరకు ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. గత కొద్ది నెలల్లో ఇది ఆరో పెంపు. ఈ పెరిగిన ధరలు ఈ రోజు నుండే అమలులోకి వచ్చాయి. ముఖ్య నగరాల్లో ధరలు.. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం.. ఇది ప్రతి రోజు దేశవ్యాప్తంగా 30 లక్షల ఇండేన్ సిలిండర్లను సరఫరా చేస్తుంది. 14.2 కిలో సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో ఈ రోజు నుండి రూ.858.5గా ఉంటుంది. జనవరి 1వ తేదీన సిలిండర్ ధర రూ.144.5 పెరిగింది. కోల్‌కతాలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ.149 పెరిగి రూ.896, ముంబైలో రూ.145 పెరిగి రూ.829.5, చెన్నైలో రూ.147 పెరిగి రూ.881గా ఉంది. ఇండేన్ గ్యాస్ 11 కోట్ల మంది గృహాలకు గ్యాస్‌ను డెలివరీ చేస్తోంది. ప్రతి నెల ధర సమీక్ష ఢిల్లీలో జనవరి1వ తేదీన రూ.714, కోల్‌కతాలో రూ.747, ముంబైలో రూ.684.5, చెన్నైలో రూ.734గా ఉంది. ఇప్పుడు వివిధ నగరాల్లో రూ.144 నుండి రూ.149 వరకు పెరిగింది. ఫ్యూయల్ రిటైలర్స్ ప్రతి నెల ఎల్పీజీ సిలిండర్ ధరలను సమీక్షిస్తారు. వీటిపైనే గ్యాస్ ధర ఆధారపడి ఉంటుంది భారతదేశంలో ఎల్పీజీ సిలిండర్ ధర ప్రధానంగా రెండు ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఒకటి ఎల్పీజీ ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్ రేటు, రెండోది రూపాయితో డాలర్ మారకం విలువ. ఈ రెండింటిపై గ్యాస్ ధర ఆధారపడి ఉంటుంది. 12 సిలిండర్లు సబ్సిడీపై.. ఫ్యూయల్ రిటైలర్స్ ఎల్పీజీ సిలిండర్లను మార్కెట్ ధరలకు విక్రయిస్తారు. అయితే ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఏడాదికి 12 గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ అందిస్తుంది. 2020-21 బడ్జెట్‌లో కేంద్రం గ్యాస్, కిరోసిన్ వంటి వాటి సబ్సిడీ కోసం రూ.40,915.21 కోట్లు కేటాయించింది. కేవలం గ్యాస్ సబ్సిడీ కోసం రూ.37,256.21 కోట్లు కేటాయించింది. రూ.3,659 కోట్లు కిరోసిన్ కోసం కేటాయించింది.
* గ్లోబల్‌ మార్కెట్ల సపోర్ట్‌తో స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడుతున్నాయి. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఎస్‌బీఐ, టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌టీ, హిందుస్తాన్‌ యూనిలివర్‌, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభపడుతుండగా..వొడాఫోన్‌, యస్‌బ్యాంక్‌, బీహెచ్‌ఈఎల్‌, అశోక్‌ లేలాండ్‌ షేర్లు స్వల్పంగా నష్టపోతున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 381 పాయింట్ల లాభంతో 41,597 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 116 పాయింట్లు పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,223 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
* చౌక ధరల విమానయాన సంస్థ ఇంటర్‌ గ్లోబ్‌ ఏవియేషన్‌ (ఇండిగో).. రూ. 999కే దేశీ రూట్లలో టికెట్‌ అందిస్తోంది. వాలెంటైన్స్‌ డే సందర్భంగా కంపెనీ ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. నాలుగు రోజులపాటు కొనసాగే ఈ చౌక చార్జీల ఆఫర్‌ మంగళవారం (11న) ప్రారంభమైంది. ఫిబ్రవరి 14 వరకు కొనసాగే ప్రేమికుల రోజు డిస్కౌంట్‌లో భాగంగా మొత్తం 10 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది మార్చి ఒకటి నుంచి సెప్టెంబర్‌ 30 వరకు జరిగే ప్రయాణాలపై తాజా డిస్కౌంట్‌ ఆఫర్‌ వర్తిస్తుందని సంస్థ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ విలియం బౌల్టర్‌ వెల్లడించారు.
* 13 రకాల ఫీచర్లతో టైటాన్ స్మార్ట్‌‌ వాచ్
‘టైటాన్ కనెక్టెడ్ ఎక్స్’ పేరుతో ఫుల్ టచ్ స్మార్ట్‌‌వాచ్‌‌ని లాంచ్ చేసింది. ఇండియన్ మార్కెట్‌‌ కోసం రూపొందిన ఈ వాచ్‌‌లో 13 రకాల ఫీచర్లున్నాయి. హార్ట్ రేటు మానిటరింగ్, ఫైండ్ ఫోన్, కెమెరా కంట్రోల్, స్లీప్ ట్రాకింగ్, వెదర్, క్యాలెండర్ అలర్ట్స్, మ్యూజిక్, సెల్ఫీ ఫీచర్లను టైటాన్ ఆఫర్ చేస్తోంది. ఈ వాచ్ ధర రూ.14,995గా టైటాన్ పేర్కొంది.టైటాన్ కనెక్టెడ్ ఎక్స్ ప్రొడక్ట్‌‌ వచ్చే నెల నుంచి అన్ని లీడింగ్ టైటాన్‌‌ స్టోర్లలో అందుబాటులో ఉంటుందని సీఈవో (వాచెస్‌‌ అండ్‌‌ వేరబుల్స్‌‌) రవికాంత్ చెప్పారు.
*సూచీలు లాభపడ్డాయి. కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న భయాలతో రెండు రోజులుగా నష్టపోయిన సూచీలు మంగళవారం సానుకూలంగా ముగిశాయి. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో పాటు కొత్త కేసుల నమోదు కూడా తగ్గడంతో.. చైనాలో తిరిగి వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించడం మదుపర్లలో సెంటిమెంటును మెరుగుపరిచింది.
*పాలసీదారుకు అపరిమిత మొత్తం ఆరోగ్యబీమా అందించే నూతన పాలసీ ‘హెల్త్ ఇన్ఫినిటీ’ని ఆవిష్కరించామని, పరిశ్రమలో ఇలాంటి పాలసీ ఇదే మొదటిది అని బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్ తెలిపింది. ఆసుపత్రిలో రోజుకు గది అద్దె ఆధారంగా ఈ పాలసీ పనిచేస్తుంది. రోజుకు రూ.3000-50,000 అద్దెను పరిగణనలోకి తీసుకుని, కవరేజీ లిమిట్ను పాలసీదారు ఎంచుకోవచ్చని తెలిపింది
*టైటన్ కంపెనీ మంగళవారం పూర్తిస్థాయి టచ్ స్మార్ట్వాచ్ను ‘టైటన్ కనెక్టెడ్ ఎక్స్’ పేరిట దేశీయ విపణిలోకి విడుదల చేసింది. 13 సదుపాయాలు కలిగిన ఈ స్మార్ట్వాచ్ ధర రూ.14,995 అని, టైటన్ విక్రయశాలల్లో మార్చి నుంచి అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. 1.2 అంగుళాల రంగుల తాకేతెర, అనలాగ్ హ్యాండ్స్ కలిగిన ఈ వాచ్ ద్వారా వ్యాయామం-నిద్ర- హృదయస్పందనను పర్యవేక్షించుకోవచ్చని, ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు, కెమేరాను నియంత్రించేందుకు, వాతావరణ వివరాలు తెలుసుకోవచ్చని టైటన్ సీఈఓ (వాచీలు, ఉపకరణాల వ్యాపారం) ఎస్.రవికాంత్ తెలిపారు.
*ప్రేమికుల రోజు సందర్భంగా దేశీయ మార్గాల్లో ప్రయాణానికి ఈనెల 14 వరకు ఆఫర్లు ఇస్తున్నట్లు విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. అన్ని పన్నులు కలుపుకుని రూ.999 నుంచి లభించే టికెట్ల విక్రయాలు ఈనెల 11 (మంగళవారం) ప్రారంభమైనట్లు తెలిపింది. మార్చి 1 నుంచి సెప్టెంబరు 30 వరకు ప్రయాణానికి ఈ టికెట్లు తమ అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది.
*ఇంజినీరింగ్ ఉత్పత్తులను అందించే పిట్టీ ఇంజినీరింగ్ డిసెంబరు త్రైమాసికంలో రూ.117.92 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.2018-19 ఇదే సమయంలో ఆదాయం రూ.165.42 కోట్లుగా ఉంది. నికర లాభం మాత్రం రూ.5.09 కోట్ల నుంచి రూ.4.06 కోట్లకు తగ్గింది. మొత్తం 9 నెలల కాలానికి రూ.412.12 కోట్ల ఆదాయం, రూ.15.56 కోట్ల నికర లాభాన్నీ గడించింది. ఔరంగాబాద్ ప్లాంటుకు రూ.129 కోట్లు, హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్న నాలుగో ప్లాంటుపై రూ.38 కోట్లు ఖర్చు చేసినట్లు సంస్థ వెల్లడించింది.
*ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో పెన్నార్ ఇండస్ట్రీస్ రూ.12.2 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2018-19 ఇదే సమయంలో ఆర్జించిన రూ.15.2 కోట్లతో పోలిస్తే ఇది 19.5శాతం తక్కువ. మొత్తం ఆదాయం రూ.537.4 కోట్లు ఉండగా, గత ఏడాది ఇది రూ.567.6 కోట్లు ఉంది. మొత్తం తొమ్మిది నెలల లాభాన్ని చూస్తే 23.2 శాతం పెరిగి రూ.52.1 కోట్లకు చేరింది. 3డీ డిజిటల్ బిల్డింగ్ మోడళ్లను తయారు చేసే వన్వర్క్ బీఐఎం టెక్నాలజీస్ను స్వాధీనం చేసుకునేందుకు బోర్డు అంగీకరించింది
*2019-20 ఆర్థిక సంవత్సరం డిసెంబరు త్రైమాసికంలో సిండికేట్ బ్యాంక్ రాణించింది. మొండి బకాయిలు తగ్గడంతో రూ.434.82 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకు అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో రూ.107.99 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
*కేంద్ర ప్రభుత్వం సకాలంలో తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ స్పష్టమైన దిశలో ముందుకు వెళ్తోందని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ స్పష్టంచేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే నాలుగు గ్రోత్ ఇంజిన్లను సజీవంగా ఉంచడంవల్ల అవి వృద్ధిరేటును వేగంగా ముందుకు తీసుకెళ్లే దిశలో సాగుతున్నాయని పేర్కొన్నారు.