Business

ఏపీ తెలంగాణాల్లో భారీగా నల్లధనం

Indian Income Tax Reveals Huge Black Money In Telugu States

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ కుంభకోణం బయటపెట్టిన ఐటీ శాఖ

లెక్కలు చూపని రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని గుర్తించిన ఐటీ శాఖ

ఫిబ్రవరి 6న హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కడప, ఢిల్లీ, పుణేల్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు

40కి పైగా ప్రాంతాల్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు

మూడు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీల కార్యాలయాల్లో సోదాలు చేసిన ఐటీ అధికారులు

దాడుల్లో బయటపడ్డ వివరాలను బయటపెట్టిన ఐటీ అధికారులు

బోగస్‌ సబ్‌ కాంట్రాక్టులు, ఓవర్ ఇన్వాయిసింగ్‌, బోగస్‌ బిల్లులు ద్వారా అక్రమాలకు పాల్పడ్డట్లు గుర్తింపు

ఓ కీలక నేత మాజీ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస్‌ నివాసంలో కీలక పత్రాలు స్వాధీనం

వాట్సప్‌ మెసేజ్‌లు, ఈమెయిల్స్‌, లెక్కచూపని విదేశీ లావాదేవీలను గుర్తించిన ఐటీ అధికారులు

బోగస్‌ సంస్థలకు సబ్‌ కాంట్రాక్టులను ఇచ్చిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కంపెనీలు

ట్యాక్స్‌ ఆడిట్‌ను తప్పించుకోవడానికి రూ.2 కోట్లకన్నా తక్కువ టర్నోవర్‌ ఉన్న కంపెనీలను సృష్టించిన అక్రమార్కులు

షెల్‌ కంపెనీలకు అసలు ఓనర్లు ప్రధాన కాంట్రాక్టర్లే అంటున్న ఐటీ అధికారులు

అసలు కంపెనీలు, షెల్‌ కంపెనీల ఐటీ రిటర్నులను ఒకే ఐపీ అడ్రస్‌తో ఫైల్ చేసినట్లు గుర్తింపు
ప్రాథమిక దర్యాప్తులోనే రూ.2వేల కోట్లకు పైగా అక్రమాల గుర్తింపు

లెక్కచూపని రూ.85 లక్షల నగదు, రూ.71 లక్షల విలువైన ఆభరణాలు సీజ్‌
25 బ్యాంక్‌ లాకర్లను సీజ్‌ చేసిన ఐటీ అధికారులు