Movies

తండ్రి సినిమాలో నక్సలైట్

Ram Charan To Star As Naxalite In Chiranjeevi 152

చిరంజీవి 152వ చిత్రం ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. కొరటాల శివ దర్శకుడు. ఇందులో రామ్‌చరణ్‌ కూడా నటిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. చిరంజీవి పాత్ర ఫ్లాష్‌ బ్యాక్‌లో చరణ్‌ కనిపిస్తారని అనుకుంటున్నారు. అంతేకాదు.. చరణ్‌ ఓ నక్సలైట్‌గా నటించబోతున్నారని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కోసం ‘ఆచార్య’ అనే పేరు పరిశీలనలో ఉంది. త్రిష కథానాయిక. మరో కథానాయికకీ స్థానం ఉందని సమాచారం.