Fashion

ఇంటి రంగులకి ఒక శాస్త్రం ఉంది

TNILIVE Telugu Home Decor || There is a field for home colors

ఇంటికి ఏ కలర్స్ వెయ్యాలి… కలర్స్ ప్రభావం మనపై ఎలా ఉంటుంది?

ఈ ప్రపంచం రంగుల మయం. తెల్లారింది మొదలు నిద్రపోయే వరకూ… చివరకు కలల్లో కూడా కలర్స్ కనిపిస్తాయి మనకు. అవి మనపై ఎంతో ప్రభావం చూపిస్తాయి. అందువల్ల ఇళ్లలో ఏ కలర్స్ ఉంటే మనకు హాయి కలుగుతుందో తెలుసుకుందాం.

ఇళ్లకు పెయింట్స్ వేసుకునేటప్పుడు… ఏ కలర్ వేసుకుంటే బెటర్ అన్నది ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సమస్యే. ఒక్కొక్కరికీ ఒక్కో కలర్ నచ్చుతుంది. కొందరికి బ్లాక్ నచ్చితే, కొందరికి అస్సలు నచ్చదు. కొందరు రెడ్ అంటే ఇష్టపడతారు. మరికొందరు రెడ్‌ని చూస్తే చాలు… చిర్రెత్తిపోతారు. ఐతే… మానసిక వేత్తలు మనుషులకూ, కలర్స్‌కీ మధ్య సంబంధాల్ని పరిశోధించారు. ఎక్కువగా ఏ కలర్స్ వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతోందో, ఇళ్లలో ఎలాంటి కలర్స్ వేసుకుంటే, ఎలాంటి ఫలితాలుంటాయో తెలుసుకున్నారు. మన వ్యక్తిగత ఇష్టాలతో సంబంధం లేకుండా… జనరల్‌గా కలర్స్ మనపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చెబుతున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందాం.

వైట్ కలర్ : ఇళ్లకు వైట్ కలర్‌ని మించిన కలర్ మరొకటి లేదు. ఐతే… ఎప్పుడూ వైట్ కలరే ఉంటే కూడా మనసుకి నచ్చదు. వైట్‌తోపాటూ… కొన్ని ఇతర కలర్స్ కాంబినేషన్ ఉండేలా చేసుకోవాలి.

గ్రీన్ కలర్ : ఈ ప్రపంచం గ్రీన్… ఎప్పటికీ ఎవర్ గ్రీనే. ఇళ్లలో గ్రీన్ కలర్ ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. నేచర్‌లో ఉన్న ఫీల్ కలుగుతుంది. ఇది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని పరిశోధకులు తేల్చారు. ముఖ్యంగా ఇంట్లోని స్టడీ రూంలో గ్రీన్ కలర్ ఎక్కువగా ఉంటే… పిల్లలు బాగా చదువుతారట. ఒత్తిడి, టెన్షన్లు తగ్గాలంటే గ్రీన్ కలర్ ది బెస్ట్.

స్కై బ్లూ కలర్ : ఆకాశం బ్లూ కలర్‌లో కనిపిస్తూ విశాలమైన ఫీలింగ్ కలిగిస్తుంది. అందువల్ల ఇళ్లకు స్కై బ్లూ కలర్ వేసుకుంటే… మనసు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యంగా డోర్స్, విండోస్‌ ఇలాంటి కలర్స్ వేసుకుంటే బాగుంటుంది.

రెడ్ కలర్ : ఈ రంగు ఎంత ఎక్కువగా ఉంటే, టెన్షన్లు అంతలా పెరుగుతాయి. రూం నిండా రెడ్ కలర్ ఉంటే… గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. కాబట్టి… ఇది వీలైనంత తక్కువగా ఉండేలా చేసుకోవాలి. ఐతే… ఈ కలర్ ఎట్రాక్టివ్‌గా ఉంటుంది. అందువల్ల ఇళ్లలో ఫ్రేములు, ర్యాక్స్, షెల్ఫులకు రెడ్ కలర్ వేసుకుంటే లుక్ బాగుంటుంది.

పింక్ కలర్ : ప్రేమకి గుర్తుగా భావించే పింక్ కలర్ మనలో ప్రశాంతతను కలిగిస్తుంది. కోపం, ఆవేశాన్ని తగ్గిస్తుంది. ఇంట్లో పింక్ కలర్ ఉంటే… బీపీ తగ్గడమే కాక, గుండె కొట్టుకునే వేగం సక్రమంగా ఉంటుందట.

ఎల్లో కలర్ : కలర్స్‌లో అత్యంత ఎక్కువగా ఎట్రాక్ట్ చేసేది ఎల్లో కలరే. కానీ ఇది బొద్దింకల్ని బాగా ఆకర్షిస్తుంది. అందువల్ల వీలైనంతవరకూ ఇళ్లలో ఎల్లో కలర్ వాడవద్దని సలహా ఇస్తున్నారు నిపుణులు.

బ్లాక్ కలర్ : ఇది వరకు బ్లాక్ కలర్‌ను చెడుకు సంకేతంగా భావించేవారు. ఇప్పుడు కాలం మారింది. బ్లాక్ కలర్ పెయింట్ హై క్వాలిటీతో ఉంటుంది. అందువల్ల ఇళ్లకు బ్లాక్ కలర్ వేస్తే… ఇంపుగా ఉంటుంది. ఐతే… లైటింగ్‌ని తగ్గించే శక్తి బ్లాక్‌కి ఉంది. ఇంట్లో కాంతి బాగా ఉండాలంటే బ్లాక్ కలర్‌ని దూరం పెట్టాల్సిందే.

ఆరెంజ్ కలర్ : ఆరెంజ్ అనేది ఎల్లో, రెడ్ కలర్స్ కాంబినేషన్. కానీ ఇది మనలో ఎనర్జీ లెవెల్స్ పెంచుతుంది. ఉత్సాహాన్ని కలిగించే, చురుకుదనాన్ని పెంచే లక్షణాలు ఆరెంజ్‌లో ఉన్నాయి. ఎట్రాక్ట్ చేసే గుణం కూడా ఉంది. అందువల్ల ఇళ్లలో ఆరెంజ్ కలర్ వేసుకుంటే హాయే హాయి.