Fashion

గులాబీ స్నానం ప్రత్యేకతలు

Fashion & Beauty News - Rose Shower And Its Benefits

చర్మం నిర్జీవంగా కాకుండా నిగారింపుతో కనిపించాలంటే… కొంత శ్రద్ధ అవసరం. ఇందుకేం చేయాలో చూద్దాం…
ఆఫీసుకి వెళ్లాలనో, ఇంటిపనులు ఉన్నాయనో…హడావుడిగా, మొక్కుబడిగా స్నానం చేసేవాళ్లే ఎక్కువ. కానీ కాస్త సమయం కేటాయిస్తే చర్మం మెరిసిపోతుందంటారు సౌందర్య నిపుణులు. గుప్పెడు గులాబీ రేకల్ని తీసుకుని ముద్దగా నూరి పెట్టండి. దానికి పావుకప్పు పంచదార, చెంచా రోజ్‌ ఆయిల్‌ కూడా కలపండి. ఈ మిశ్రమాన్ని స్నానం చేసే ముందు ఒంటికి రుద్దుకుంటే..ఆ సువాసనకు, వాటిల్లోని సౌందర్య సుగుణాలకు మనసు తేలికపడుతుంది. చర్మం మెరిసిపోతుంది.
* స్నానం చేసే గోరువెచ్చని నీళ్లలో రెండు చెంచాల లావెండర్‌ బాత్‌సాల్ట్‌ని వేయండి. ఆ నీటితో స్నానం చేస్తే ఎంతో హాయిగా అనిపిస్తుంది. చర్మం తాజాగా ఉండటంతోపాటూ తేమతో నిగనిగలాడుతుంటుంది.
* బాత్‌బాంబ్స్‌… ఇప్పుడు లేటెస్ట్‌ ట్రెండ్‌. వీటిని స్నానం చేసే నీళ్లల్లో వేసుకుంటే…చర్మంపై పేరుకున్న దుమ్ము, ధూళి, మృతకణాలు తొలగిపోవడమే కాదు.. చర్మం నిగారింపుతో కనిపిస్తుంది. ఇవి రోజ్‌, లావెండర్‌, మింట్‌…లాంటి ఎన్నో రకాల్లోనూ లభిస్తున్నాయి.