Kids

రేపటి నుండి తాజ్ వద్ద సందర్శుకలకు అనుమతి

పర్యాటకులకు శుభవార్త. దేశానికే తలమానికంగా నిలిచిన తాజ్‌మహల్‌ ఆరునెలల తరువాత తెరుచుకోనుంది. సోమవారం నుంచి ఈ విశిష్ట కట్టడం సందర్శనకు అనుమతిస్తున్నట్లు పురావస్తుశాఖ అధికారులు వెల్లడించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆదివారం తెలిపారు. తూర్పు, పశ్చిమ ద్వారాల వద్ద శానిటైజేషన్‌తోపాటు థర్మల్‌ స్క్రీనింగ్‌, భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసినట్లు తాజ్‌మహల్‌ సంరక్షకుడు అమర్‌నాథ్‌ గుప్తా పేర్కొన్నారు. ఇందుకోసం పర్యాటకులు ముందుగానే ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. విదేశీయులకు ప్రవేశ టికెట్‌ ధర రూ.1100గా నిర్ణయించారు. స్వదేశీయులు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఒక షిఫ్ట్‌లో 2500 మందిని మాత్రమే అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రసిద్ధ ఆగ్రా కోట సందర్శనకు అధికారులు అనుమతించారు.