Movies

వివాదాలకు ఎవరు కారణమో తెలుసుకోండి. పదవులు చాలా చిన్నవి.

వివాదాలకు ఎవరు కారణమో తెలుసుకోండి. పదవులు చాలా చిన్నవి.

‘మా’ ఎన్నికలపై ప్రముఖ నటుడు చిరంజీవి స్పందించారు. ‘పెళ్లి సందD’ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి వెంకటేశ్‌తో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నారప్ప’ నాకు బాగా నచ్చింది. ఆ సినిమా చూసిన వెంకటేశ్‌ని అభినందించాను. తనకి నేను నటించిన ‘సైరా’ బాగా నచ్చి, నన్ను మెచ్చుకున్నాడు. అందరి హీరోల మధ్య ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే పరిశ్రమలో వివాదాలు, కొట్టుకోవడం, ఒకరినొకరు మాటలు అనడం, అనిపించుకోవడం ఉండదు కదా. ఏదైనా తాత్కాలికమే. అవి రెండేళ్లుంటాయా? మూడేళ్లుంటాయా? నాలుగేళ్లుంటాయా? పదవులు అనేవి చిన్న చిన్న బాధ్యతల్లాంటివి. వాటి కోసం మనం మాటలు అనడం, అనిపించుకోవడం చూస్తుంటే బయటవారికి ఎంత లోకువ అయిపోతాం? పదవి కోసం అంత లోకువ అవ్వాలా? అది నాకు బాధగా ఉంది. నేను ఏ ఒక్కరినీ వేలు పెట్టి చూపించడం లేదు. మన ఆధిపత్యం చూపించుకునేందుకు ఎదుటవారిని కించపరచాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కడ ప్రారంభమైందో గుర్తుంచుకోండి. ఎవరి కారణంగా ఈ వివాదాలు మొదలయ్యాయో ఆలోచించండి. అలాంటి వ్యక్తిని దూరంగా ఉంచితేనే వసుధైక కుటుంబం అవుతుంది’ అని అన్నారు.